పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పర్యటన స్వదేశంలో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో జరిగిన సమావేశంలో జింజియాంగ్ ప్రావిన్సులో వుయ్ఘుర్ ముస్లింల మీద బీజింగ్ అరాచాకాల్ని ప్రస్తావించక పోగా చైనా చర్యలకు మద్దతు ఇవ్వటం ఇమ్రాన్ ఖాన్ కు సమస్యలు సృష్టించే విధంగా ఉన్నాయి. టిబెట్, తైవాన్, ఫాక్లాండ్ దివులతో సహా అన్ని అంశాల్లో పాకిస్తాన్ మద్దతు ఇస్తోందని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించటం పాక్ లో ప్రకంపనలకు అజ్యంపోస్తోంది. సిపెక్ లో పాక్ ప్రయోజనాలు కాపాడే విధంగా ఇమ్రాన్ వ్యవహరించలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
అయితే వుయ్ఘుర్ ముస్లింల మీద చైనా దమనకాండ ఖండిస్తూ ఇస్లామాబాద్, లాహోర్ సహా కరాచి నగరాల్లో వివిధ విద్యార్ధి సంఘాలు, పౌర సంఘాలు సమావేశాలు నిర్వహించాయి. ఇమ్రాన్ దౌత్యం పాకిస్తాన్ కు నష్టం చేసే విధంగా ఉందని మేధావులు మండిపడుతున్నారు. గ్వదర్ ఓడరేవు లో పాక్ ప్రజలకు ఉపాధిపై చైనా నుంచి స్పష్టమైన ప్రకటన రాబట్టలేదని బలోచిస్తాన్ ప్రజలు ఇమ్రాన్ ఖాన్ పై ఆగ్రహంతో ఉన్నారు. క్వెట్ట నగరంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
అయితే కంటితుడుపు చర్యగా పాకిస్తాన్ కు అండగా ఉంటామని చైనా ప్రకటించింది. పాకిస్తాన్ జాతీయ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం, గౌరవం, తీవ్రవాదంపై పోరుకు తమ మద్దతు ఉంటుందని ఇమ్రాన్ తో జిన్ పింగ్ చెప్పినట్టు జిన్హువా న్యూజ్ ఏజెన్సీ తెలిపింది. చైనా- పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) ను ముందుకు తీసుకెళ్లేందుకు పాకిస్తాన్ తో కలసి పనిచేస్తామని హామీనిచ్చారు.
కశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి చైనా మద్దతునిస్తున్నట్టు అక్కడి అధికార యంత్రాంగం పేర్కొంది. ఏకపక్ష చర్యలు పరిస్థితిని తీవ్రతరం చేస్తాయని, వీటిని తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. శాంతియుత, సౌభాగ్య దక్షిణాసియా అన్నది ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షగా సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
Also Read : ఇమ్రాన్ ఖాన్ పాలనపై నిరసనలు