US Army Forces : ఉక్రెయిన్ – రష్యా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం పెరుగుతోంది. రష్యా ఏ క్షణమైనా ఉక్రెయిన్ మీద దాడి చేయొచ్చని యూరోప్ దేశాలు, అమెరికా ప్రచారం చేస్తున్నాయి. నాటో బలగాలు ఇప్పటికే ఉక్రెయిన్ కు మద్దతుగా రంగంలోకి దిగాయి. అమెరికా ఈ రోజు మూడు వేల బలగాల్ని పోలాండ్ పంపింది. ఈ మేరకు పెంటగాన్ ద్రువీకరించింది. ఇప్పటికే మొదటి దఫా 17 వందల మందితో కూడిన అమెరికా సైనిక పటాలం పోలాండ్ చేరుకోగా ఇప్పుడు అదనపు బలగాలు వేలుతున్నాయని పెంటగాన్ ప్రకటించింది. కొద్ది రోజుల్లోనే మూడు వేల మందితో కూడిన బలగాలు పోలాండ్ చేరుకుంటాయని అమెరికా జాతీయ భద్రత సలహాదారు జాకే సులివన్ వెల్లడించారు. ఉక్రెయిన్ కు మద్దతుగా పోలాండ్ కు చేరుకునే అమెరికా దళాలు మొత్తం ఐదు వేలు ఉంటాయని పెంటగాన్ వర్గాలు ప్రకటించాయి.
బీజింగ్ ఒలింపిక్స్ జరిగే ఈ సమయంలో రష్యా దాడులు చేయొచ్చని అమెరికా భద్రతా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమకు ఉక్రెయిన్ మీద దాడి చేసే ఆలోచనే లేదని రష్యా స్పష్టం చేసింది. గతంలో ఎన్నడు లేనివిధంగా అమెరికా అత్యుత్సాహం చూస్తుంటే యుద్దనికే వస్తున్నట్టుగా ఉందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా సఖరోవ వ్యాఖ్యానించారు. అమెరికా తీరుతో యూరోప్ లో అస్థిరత నెలకొనే ప్రమాదం ఉందని మాస్కో ఆందోళన వ్యక్తం చేస్తోంది. నాటోకు మద్దతుగా ఉక్రెయిన్ దరిదాపుల్లోకి వచ్చేందుకు అమెరికా ప్రయత్నించటం మరింత ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.
Also Read : రష్యా- ఉక్రెయిన్ వివాదంపై యుకె అసహనం