Friday, April 19, 2024
HomeTrending Newsగంజాయి సాగుకు మావోల సహకారం: డిజిపి

గంజాయి సాగుకు మావోల సహకారం: డిజిపి

Maos behind Ganja: ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి పండించేందుకు మావోయిస్టులు సహకరిస్తున్నారని, దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారని  రాష్ట్ర  డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యానించారు. ఒడిశాలోని 23 జిల్లాలో, విశాఖ ఏజెన్సీలో 11 మండలాల్లో గంజాయి సాగువుతోందని వెల్లడించారు.   ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల్లో దశాబ్దాలుగా గంజాయి అక్రమసాగు కొనసాగుతుందని చెప్పారు.  ఏవోబీ సరిహద్దుల్లోని నాలుగు జిల్లాల పరిధిలో పట్టుబడిన 2 లక్షల కేజీల గంజాయిని తగలబెట్టే కార్యక్రమాన్ని విశాఖ రూరల్ పరిధిలోని అనకాపల్లి మండలం కోడూరు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌతమ్ సావాంగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా డిజిపి మాట్లాడుతూ గంజాయి విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారని రాజకీయ నాయకులు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సరైన సమాచారం, విషయం తెలియకుండా మాట్లాడుతున్నారని, ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

డిజిపి మాట్లాడిన ముఖ్యాంశాలు:

⦿ గంజాయిని సమూలంగా నాశనం చేసేందుకు ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం చేపట్టాము
⦿ ఆపరేషన్ పరివర్తన ద్వారా 11 మండలాల్లో 313 శివారు గ్రామాల్లో 406 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం
⦿ 9251.32 కోట్ల రూపాయలు విలువ చేసే 7,552 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం చేశాం
⦿ ఈ కార్యక్రమం ఇకపై కూడా చేస్తునే ఉంటాం
⦿ పలు రాష్ట్రాలకు చెందిన ముఠాలు ఏవోబి లో యదేచ్చగా గంజాయి సాగు, అక్రమ రవాణా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి
⦿ గంజాయి స్మగ్లర్లు దేశ వ్యాప్తంగా ఉన్నారు…అన్ని విధానాలు , మార్గాల ద్వారా గంజాయి రవాణా చేస్తున్నారు
⦿ గిరిజనులు స్వచ్ఛందంగా 400 ఎకరాలు ధ్వంసం చేశారు
⦿ గంజాయి నివారణ కోసం 120 అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం
⦿ విశాఖ లో గంజాయి సాగు, సరఫరా చేస్తున్న వారిపై 577 కేసులు నమోదు చేసి 1500 మందిని అరెస్ట్ చేశాం
⦿ ఇప్పటి వరకు 47,987 కిలోల గంజాయి; 46.41 లీటర్లు హషిష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నాం
⦿ 314 వాహనాలు సీజ్ చేశాం
⦿ ఇతర రాష్ట్రాల కు చెందిన 154 మంది స్మగ్లర్లు తో పాటు కొత్తగా 300 పై కొత్తగా హిస్టరీ షీట్లు తెరిచాం
⦿ నాలుగు జిల్లాలో 1,363 కేసులు నమోదు చేశాం
⦿ ఏజెన్సీలో నక్సల్ ప్రభావం తగ్గిపోతుంది…ఏజెన్సీలో మార్పు మొదలైంది….
⦿ గిరిజనుల గంజాయి సాగు వైపు వెళ్లకుండా 1963 అవగాహన కార్యక్రమాలు 93 ర్యాలీలు నిర్వహించాం
⦿ గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళేలా చేస్తాం
⦿ గంజాయి ఇప్పుడు హషిష్ ఆయిల్ రూపంలో కొత్త రూపం తీసుకుంది
⦿ దాని మీద కూడ ఉక్కపాదం మోపుతున్నాము

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్