Saturday, November 23, 2024
HomeTrending Newsచైనా కంపెనీలపై దాడులు

చైనా కంపెనీలపై దాడులు

మయన్మార్ లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. మాండలే ప్రాంతంలోని నతోగ్యి పట్టణంలో చైనా కు చెందిన ఆయిల్ కంపెనీ గ్యాస్ పైప్ లైన్ ను సైనిక వ్యతిరేక వర్గాలు ధ్వంసం చేశారు. నతోగ్యి పీపుల్స్ డిఫెన్సు ఫోర్సు(NPDF)రెబెల్ గ్రూపుకు చెందిన మిలిటెంట్లు పెద్ద సంఖ్యలో వచ్చి పైప్ లైన్ ధ్వంసం చేశారు. దాడుల్లో సాధారణ పౌరులు కూడా పాల్గొన్నారు. మయన్మార్ లో సైనిక ప్రభుత్వం దిగిపోవాలని నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య పునరుద్దరణకు సహకరించాలని దాడుల్లో పాల్గోన్నవారు డిమాండ్ చేస్తు కరపత్రాలు విడుదల చేశారు.

973 కిలోమీటర్ల పొడవైన గ్యాస్ పైప్ లైన్ మయన్మార్ లోని మాగ్వే ప్రాంతం నుంచి చైనాలోని యున్నన్ రాష్ట్రానికి చేరుతుంది. ప్రజాస్వామ్యవాదుల దాడులతో మిలిటరీ పాలకులు పెద్దమొత్తంలో భద్రత పెంచారు.నత్యోగి పట్టణంలో వందలమందిని అరెస్టు చేశారు. తమకు గత్యంతరం లేకనే దాడులు చేయాల్సి వస్తోందని, మిలిటరీ అకృత్యాలు పెరిగాయని సాధారణ పౌరులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేఖ శక్తుల తనిఖీల పేరుతో సైనికులు లూటీలు చేస్తున్నారని, అందిన కాడికి దోచుకెల్తున్నారని వారు ఆరోపించారు.

మయన్మార్ లో చైనా వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల తిగ్యంగ్ టౌన్షిప్ లో చైనాకు చెందిన నికెల్ ప్రోసెసింగ్ కంపెనీకి, ఉద్యోగుల నివాస ప్రాంతాలకు ఆందోళనకారులు విద్యుత్ సరఫరా నిలిపేశారు. ట్రాన్స్ఫార్మర్ లతో పాటు విద్యుత్ లైన్ లను ద్వంసం చేశారు. మిలిటరీ పాలకుల అక్రమాలకు సహకరిస్తూ చైనా కంపనీలు వనరులు దోచుకుంటున్నాయని, అధికారం కాపాడుకునేందుకు జుంట పాలకులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. చైనా ఆయిల్ కంపెనీపై దాడి చేసిన ఆందోళనకారులు బీజింగ్ వస్తువుల్ని కొనుగోలు చేయొద్దని, చైనా కంపెనీలను బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు. దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలనపై కుట్ర చేసి, జుంట పాలకులకు సహకరించింది చైనా కమ్యూనిస్టు నాయకులే అనే మయన్మార్ ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు.

Also Read : ఆఫ్రికాలో చైనా కంపెనీలపై వ్యతిరేకత

RELATED ARTICLES

Most Popular

న్యూస్