Saturday, November 23, 2024
HomeTrending Newsతమిళనాడులో స్థానిక సంస్థల పోలింగ్

తమిళనాడులో స్థానిక సంస్థల పోలింగ్

పదేళ్ళ విరామం తర్వాత తమిళనాడులో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఈ రోజు (శనివారం) జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. చెన్నైతో సహా 21 నగరాలకు, 138 మున్సిపాలిటీలు, 490 నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గత ఐదేళ్లలో ఎన్నికలు జరగకపోవడంతో స్థానిక సంస్థలకు ప్రజా ప్రతినిధులు లేరు. ఈ దఫా 12 వేల కన్నా ఎక్కువ మంది సభ్యులను ఎన్నుకోనున్నారు. ఓటింగ్‌ ప్రశాంతంగా సాగేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీగా పోలీస్‌ సిబ్బందిని మోహరించారు. అధికార డిఎంకెకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. లోక్‌సభ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో మంచి ఊపుమీద వున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌.. ఈ గెలుపును కూడా తన ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంగా పనిచేశారు. తమ సత్తా చాటాలని ప్రతిపక్ష అన్నాడిఎంకె ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ నేపధ్యంలో ఓటర్లను మభ్యపెట్టేందుకు డబ్బులు పంచుతుందని వార్తలు వస్తున్నాయి. కాగా, తెలంగాణా గవర్నర్‌ సౌందర్యరాజన్‌ తన ఓటు హక్కును వినియోగించారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ దంపతులు, సినీనటుడు విజయ్ కుమార్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

649 పట్టణ స్థానిక సంస్థలు 21 మున్సిపల్ కార్పొరేషన్లు, 138 మునిసిపాలిటీలు, 490 పట్టణ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తదనంతరం, తూత్తుకుడి జిల్లాలోని కదంబూర్ పట్టణ పంచాయతీలోని మొత్తం 12 వార్డులకు ఎన్నికలు ఉల్లంఘనల కారణంగా రద్దు చేయబడ్డాయి. శివగంగ జిల్లాలోని ఒక పట్టణ పంచాయతీ వార్డు (కానడుకథన్)కు నామినేషన్లు దాఖలు కాలేదు. మొత్తం 218 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్