Saturday, November 23, 2024
HomeTrending Newsభారతీయ పౌరులకు ఎంబసీ సూచనలు

భారతీయ పౌరులకు ఎంబసీ సూచనలు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ పౌరులను సురక్షితంగా భారత్‌కు తరలించేందు కేంద్ర ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ప్రభుత్వం అక్కడున్న పౌరులకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ దేశంలోని భారతీయ పౌరులందరూ ప్రభుత్వ అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా సరిహద్దు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచిస్తూ.. భారత రాయబార కార్యాలయం తాజాగా ప్రకటన విడుదల చేసింది. సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద పరిస్థితి సున్నితంగా ఉందని, పౌరులను స్వదేశానికి తరలించేందుకు పొరుగుదేశాలతో భారతీయ రాయబార కార్యాలయం నిరంతరం యత్నిస్తుందని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌ దేశంలోని భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
భారత పౌరులు సాధ్యమైనంత వరకు ఇల్లు, షెల్టర్లలోనే ఉండాలని, అరకొరగా ఉన్న సదుపాయాలతో కొంచెం ఓపిగ్గా పట్టాలని ఇండియన్ ఎంబసీ సూచించింది. బయట ఉన్న పరిస్థితులపై  సరైన అవగాహన లేకుండా.. సరిహద్దులకు చేరుకొని ఇబ్బందులకు గురికావద్దని, అవగాహన లేకుండా సరిహద్దులకు చేరుకోవడం కంటే.. ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతాల్లో ఉండటమే సురక్షితమని స్పష్టం చేసింది. ముందస్తు సమాచారం లేకుండా సరిహద్దుల వద్దకు చేరుకునే భారతీయులకు సహకరించడం క్లిష్టంగా మారుతోందని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్‌ చేసింది. హంగేరీ, రొమేనియా, పోలాండ్‌లకు భారతీయ విద్యార్థులను తరలించి అక్కడి నుంచి న్యూఢల్లీికి తీసుకువచ్చేందుకు పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఎల్వివ్‌, చెర్నివ్ట్సీ పట్టణాల్లో క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేశారు.

ఉక్రెయిన్‌ నుంచి బారతీయుల నిష్క్రమణను సమన్వయం చేయడానికి భారత ప్రభుత్వం హంగేరీలోని జహోనీ సరిహద్దు పోస్ట్‌, క్రాకోవిక్‌, పోలాండ్‌లోని షెహిని-మెడికా ల్యాండ్‌ సరిహద్దు పాయింట్లు, స్లోవాక్‌ రిపబ్లిక్‌లోని వైస్నే నెమెకే, రొమేనియాలోని సుసెవా ట్రాన్సిట్‌ పాయింట్‌లలో అధికారుల బృందాలను ఏర్పాటు చేసింది.

Also Read : భారతీయుల తరలింపు ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్