ఉక్రెయిన్  నుంచి భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆపరేషన్ గంగ లో భాగంగా ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించేందుకు నలుగురు కేంద్రమంత్రులు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లి అక్కడే ఉండి భారత ఎంబసీతో సమన్వయం చేయనున్నారు.  ఈ మేరకు కేంద్రప్రభుత్వం ఈ రోజు(సోమ వారం ) నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, హర్ దీప సింగ్ పూరి, కిరెన్ రిజిజు, వి.కే సింగ్ లు ఈ రోజు పయనం కానున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఉత్తరప్రదేశ్ పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్నాక అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో విదేశాంగశాఖ మంత్రి జై శంకర్, విదేశాంగశాఖ కార్యదర్శి హర్ష శ్రింగ్ల, క్యాబినెట్ కార్యదర్శ్రి రాజీవ్ గౌబాతో పాటు ఇతర ఉన్నతాదికారాలు పాల్గొన్నారు. ఉక్రెయిన్ లో భారతీయుల పరిస్థితిపై చర్చించేందుకు ప్రధానమంత్రి నేతృత్వంలో రెండు రోజుల్లో రెండుసార్లు అత్యున్నత సమావేశం నిర్వహించగా భారత పౌరుల  సంక్షేమమే  ముఖ్యమైన అజెండా అని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

భారత పౌరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం నిరంతరం వారికి, సలహాలు సూచనలు చేస్తోంది. ఎంబసీకి తోడుగా నలుగురు కేంద్రమంత్రులు కూడా ఆపరేషన్ గంగ లో పాల్గొనేందుకు ప్రత్యేక రాయబారులుగా రావటం ద్వారా తరలింపు ప్రక్రియ వేగంగా జరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత పౌరుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read : కీవ్ నగరాన్ని చుట్టుముట్టిన రష్యా

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *