తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పిస్తే.. వారి ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తిస్తామని ఇరాన్ ప్రకటించింది. తాలిబాన్ లు మహిళలు, మైనారిటీలకు తగిన అవకాశాలు ఇవ్వటంతో పాటు, వారి రక్షణకు చర్యలు చేపట్టాలని ఇరాన్ కోరింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ అబ్దోల్లహియాన్ ఈ రోజు టెహరాన్ లో వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా ఇరవై ఏళ్ళు ఉంది మరింత విచ్చిన్నం చేసిందని అమీర్ విమర్శించారు. 20 ఏళ్ళ క్రితం అమెరికా ఆఫ్ఘన్ లో అడుగు పెట్టినపుడు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపింది ఇరాన్ దేశమేనని ఆయన గుర్తు చేశారు. అయితే తాలిబాన్ ల ఏలుబడిలో మైనారిటీ వర్గాలు అణచివేతకు గురవుతున్నాయని, మహిళలకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం దక్కడం లేదని…. ఆఫ్ఘన్ సరిహద్దు దేశంగా కాబుల్ లో సుస్థిర ప్రభుత్వం ఉండాలన్నదే ఇరాన్ ఆకాంక్ష అని అమీర్ స్పష్టం చేశారు. తాలిబన్లు మానవ హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని.. ఇరాన్ వచ్చిన బృందంలో కేవలం ఒక వర్గం వారే కనిపించారని అన్నారు.
ఇటీవల తాలిబాన్ నేతల బృందం టెహ్రాన్ లో పర్యటించింది. ఆఫ్ఘన్ బృందానికి నాయకత్వం వహించిన తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి తమ ప్రభుత్వాన్ని గుర్తించాలని ఇరాన్ ప్రభుత్వాన్ని కోరారు. సరిహద్దు దేశమైన ఇరాన్ కూడా ముస్లిం దేశం కావటంతో ఆ దేశం గుర్తిస్తే మిగత దేశాలను సంప్రదించవచ్చని తాలిబన్లు భావించారు. అయితే దేశంలో మహిళలను విద్య, ఉద్యోగాలకు దూరం చేయటం, మైనారిటీ వర్గాలను టార్గెట్ చేసి దాడులు చేయటం… ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని, గత ప్రభుత్వంలో పనిచేసిన వారిని హతమార్చటం.. మానవ ఉల్లంఘన ఉల్లంఘన తాలిబాన్ ప్రభుత్వ గుర్తుంపునకు ప్రతిబంధకాలుగా మారాయి.