Agri Budget: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు 2022-23 సంవత్సరానికి గాను వ్యవసాయ బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశ పెట్టారు. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తరువాత కన్నబాబు వ్యవసాయానికి ప్రత్యేకంగా పద్దులను ప్రతిపాదించారు.
వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు:
- వైఎస్సార్ ఉచిత పంటల భీమా – రూ. 1,802 కోట్లు
- వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు – రూ. 500 కోట్లు
- విత్తన రాయితీ – రూ. 200 కోట్లు
- ప్రకృతి విపత్తుల సహాయ నిధి – రూ. 2.000 కోట్లు
- సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాలకు – రూ. 50 కోట్లు
- రైతుల ఎక్స్ గ్రేషియా కోసం- రూ. 20 కోట్లు
- ఆధునికత సాంకేతికత కోసం – రూ. 200 కోట్లు
- మార్కెట్ యార్డుల్లో నాడు-నేడు కోసం – రూ. 614.23 కోట్లు
- సహకార శాఖకు – రూ. 248.45 కోట్లు
- ఆహార శుద్ధి – రూ. 146.41 కోట్లు
- ఉద్యానవన శాఖకు – రూ. 554 కోట్లు
- పట్టు పరిశ్రమ శాఖకు – రూ. 98.99 కోట్లు
- ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయానికి – రూ. 421.15 కోట్లు
- వెంకటేశ్వర పశు వైద్య విశ్వ విద్యాలయం – రూ. 122.50 కోట్లు
- వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి – రూ. 59.91 కోట్లు
- పశు సంవర్ధక శాఖ – రూ.1,027.82 కోట్లు
- మత్స్య శాఖ అభివృద్ధి కోసం – రూ. 337.23 కోట్లు
- వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం – రూ. 5,000 కోట్లు
- వైఎస్సార్ జల కళ – రూ. 50 కోట్లు
- నీటి పారుదల రంగానికి – రూ. 11, 450.94 కోట్లు
- వైఎస్సార్ రైతు భరోసా – రూ. 7,020 కోట్లు
- వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు – రూ. 18 కోట్లు
ఇవి కూడా చదవండి: ఏపీ బడ్జెట్: నవరత్నాలకే పెద్ద పీట