Saturday, November 23, 2024
Homeజాతీయంఉచిత వ్యాక్సిన్ మార్గదర్శకాలు విడుదల

ఉచిత వ్యాక్సిన్ మార్గదర్శకాలు విడుదల

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ప్రకటించిన ఉచిత వ్యాక్సిన్ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో ప్రకటించిన జాతీయ వ్యాక్సిన్ విధానంలో మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. కరోనా కేసుల తీవ్రత, జనాభా ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేయనుంది. టీకా ఇవ్వడంలో హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్, 45 ఏళ్ళు పైబడిన వారికి, రెండో డోస్ వేయించుకోవాల్సిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించింది. జూన్ 21 నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి.

ఆదాయ స్థితితో సంబంధం లేకుండా అందరికీ వ్యాక్సిన్ ను అందివ్వనుంది, టీకా స్లాట్ బుక్ చేసుకునేందుకు కో-విన్ సైట్ లో కొన్ని మార్పులు చేయనున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు కావాల్సిన వ్యాక్సిన్ల సమాచారాన్ని రాష్ట్రాలే కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుందని, వ్యాక్సిన్ వృథా చేస్తే తదుపరి కేటాయింపుల్లో కొత్త విధిస్తామని, పేద ప్రజలు ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా వేయించుకోవడానికి ఈ-ఓచర్లు ఇస్తామని పేర్కొంది. ప్రతి వ్యాక్సిన్ సెంటర్లో ఎన్ని డోసులు అందుబాటులో ఉన్నాయో ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఆన్ లైన్ లో అప్ డేట్ చేయాలని సూచించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్