Sunday, November 24, 2024
HomeTrending Newsరోడ్లపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం: మంత్రి

రోడ్లపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం: మంత్రి

AP roads:  చంద్రబాబు హయాంలో కరవు రాజ్యమేలిందని, సిఎం జగన్ వచ్చిన తరువాత వరుసగా వర్షాలు పడుతున్నాయని, అందుకే నల్లరేగడి భూములున్న ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఎం. శంకర నారాయణ అన్నారు. గత ప్రభుత్వ కాలంలో కనీసం రోడ్ల మరమ్మతులు కూడా చేయించలేదని, అందుకే రోడ్లు ఈ విధంగా పాడయ్యాయని వివరించారు. కేవలం అమరావతి పైనే దృష్టి కేంద్రీకరించి, గ్రాఫిక్స్ ద్వారా భ్రమరావతి చేశారని విమర్శించారు.  మూడేళ్ళుగా రాష్ట్రంలో  సిఎం జగన్ నేతృత్వంలో వ్యవసాయ, అనుబంధ రంగాలు, పారిశ్రామిక, పెట్టుబడుల రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధిస్తోందన్నారు.

వర్షాలు తగ్గిన వెంటనే రోడ్ల మరమ్మతులు మొదలుపెట్టామని, గత ఐదేళ్ళలో సరాసరి 739  కోట్ల రూపాయలు ఖర్చు చేయగా తమ ప్రభుత్వం 770 కోట్లు ఖర్చు చేస్తోందని వివరించారు. ఐదేళ్ళలో రహదారుల రంగానికి కేవలం 11వేల కోట్ల రూపాయలు వ్యయం చేయగా తమ ప్రభుత్వం మూడేళ్ళలోనే 13 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.  బాబు పాలనలో ఏపీ ఆర్డీసి ద్వారా మూడు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని దానిలో ఒక్క రూపాయి కూడా రోడ్లపై ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు. వారి నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో రోడ్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.  రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి 6,400 కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తున్నామని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్