Monday, June 15, 2026
Homeసినిమామాస్ లుక్ తో ఎంట్రీ ఇస్తున్నఎన్టీఆర్ బామ్మర్ది

మాస్ లుక్ తో ఎంట్రీ ఇస్తున్నఎన్టీఆర్ బామ్మర్ది

ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కుమారుడు నార్నే నితిన్ (జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు) కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘శ్రీ శ్రీ శ్రీ రాజా వారు’ టైటిల్ ఖరారు చేశారు. శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్ పై రామారావు చింతపల్లి , MS రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 2017లో “శతమానం భవతి” సినిమా తీసి నేషనల్ అవార్డు గెలుచుకుని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వేగేశ్న సతీష్  దర్శకత్వం వహించారు.

చిత్ర హీరో నితిన్ నటనలో పూర్తి శిక్షణ తీసుకున్న తరువాతే “శ్రీశ్రీశ్రీ రాజా వారు” వంటి విభిన్నమైన ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ సినిమాను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈరోజు హీరో నార్నే నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆలయ ఉత్సవాల నేపథ్యంలో సృజనాత్మకంగా రూపొందించిన పోస్టర్ లో సైడ్ పోజ్‌లో ఉన్నాడు నార్నే నితిన్.

జాతరలో స్టైల్‌గా సిగరెట్ వెలిగిస్తున్న నార్నే నితిన్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. అక్షరాలను సిగరెట్‌లా డిజైన్ చేయడంతో సినిమా లోగో క్యూరియాసిటీని మరింత పెంచింది.

‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు” చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయ మవుతున్న నార్నే నితిన్ కు  ప్రేక్షకుల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని దర్శకుడు సతీష్ వేగేశ్న పేర్కొన్నారు.

Also Read : షూటింగ్ పూర్తి చేసుకున్న హర్రర్ థ్రిల్లర్ ‘అను’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular