Liquor Sales: జగన్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగాయని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. గతంలో 11, 569 కోట్లు ఉన్న విక్రయాలు ఇప్పుడు 24,714 కోట్ల రూపాయలకు పెరిగాయన్నారు. టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. నిన్న అసెంబ్లీలో సిఎం జగన్ చేసిన ప్రకటనపై స్పందించారు. మద్యంపై ఆదాయాన్ని తగ్గిస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు ఆదాయం పెంచేలా చేయడం మోసం కాదా అని ప్రశ్నించారు. ఈ ఏడాది 16,500 కోట్ల రూపాయలు మద్యం పై ఆదాయం వస్తుందని ఈ బడ్జెట్ లో అంచనా వేస్తున్నట్లు ఆర్ధిక శాఖ మంత్రి చెప్పారని, అంటే 30 వేల కోట్ల రూపాయల మద్యం విక్రయం అయితేనే ఈ ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు.
మద్యంపై వేల కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నారని, ఈ ఆదాయాన్ని తాకట్టు పెట్టి రుణాలు కూడా తీసుకున్నారని అచ్చెన్న విమర్శించారు. దీనికోసమే మద్యం పాలసీని కూఒడా మార్చారన్నారు. ఈ ఐదేళ్ళలో మద్యం ద్వారా జగన్ అక్రమంగా పదివేల కోట్ల రూపాయలు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, ప్రతి నెలా రెండొందల కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కు వస్తున్నాయని ఆరోపించారు. అందుకే మద్యం షాపులు, లిక్కర్ కంపెనీలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. చంద్రబాబు పెట్టిన పథకాలన్నీ రద్దు చేసిన జగన్ తమ హయాంలో ఇచ్చిన డిస్టిలరీ కంపెనీల అనుమతులు ఎందుకు రద్దు చేయలేకపోయారని నిలదీశారు. కంపెనీలు ఎవరిపేరు మీద ఉన్నా జగన్ బినామీల కనుసన్నల్లోనే నడుస్తున్నాయన్నారు.
నాటుసారా మరణాలపై అసెంబ్లీలో చర్చ జరగాలని పట్టుబడితే తమను సస్పెండ్ చేశారని అచ్చెన్న గుర్తు చేశారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నయనే తాము ప్రాణాలు పణంగా పెట్టి పోరాతుడున్నామని చెప్పారు .
Also Read : మందు బాబుల దేశ సేవ