Sunday, May 19, 2024
HomeTrending Newsఅమరావతి ‘యాక్ట్ అఫ్ పార్లమెంట్’: లోకేష్

అమరావతి ‘యాక్ట్ అఫ్ పార్లమెంట్’: లోకేష్

Its a Act: రాష్ట్ర విభజన పార్లమెంట్ లో జరిగిందని,  ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం పార్లమెంట్ లో పాస్ అయ్యిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అందులో స్పష్టంగా ఒక రాజధాని  అని అని పేర్కొన్నారని, రాజధానులు అననేదని గుర్తు చేశారు.  ఇది ‘యాక్ట్ అఫ్ పార్లమెంట్’ అని, దీని ఆధారంగానే కోర్టు తీర్పు ఇచ్చిందని లోకేష్ చెప్పారు.  రాజధాని అంశానికి సంబంధించి ఇచ్చిన తీర్పుని పట్టుకొని శాసనసభకి ఏ అధికారాలు లేవా అంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు.  కోర్టు తీర్పులను గౌరవించకుండా న్యాయ వ్యవస్థను కించపరిచేలా శాసనసభ వేదికగా మాట్లాడటం బాధాకరమన్నారు.

తెలుగుదేశం పార్టీగా తమది సింగిల్ పాయింట్ ఎజెండా అని, రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది తమ అభిమతమన్నారు.  పదో తరగతి ఫెయిల్ అయిన వైసిపి నాయకులకు, అసలు ఏమి చదివాడో తెలియని జగన్ రెడ్డికి చట్టాల గురించి ఏం తెలుస్తుందని లోకేష్ ప్రశ్నించారు.

అభివృద్ధి వికేంద్రీకరణ తాము చేసి చూపించామని,  రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి…  మీ హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చర్చకు సిద్దమా అని లోకేష్ సవాల్ విసిరారు.  చంద్రన్న పెళ్లి కానుక, అన్నా క్యాంటీన్, చంద్రన్న బీమా, విదేశీ విద్య… ఇలాంటివి చంద్రబాబు గారి బ్రాండ్ లని లోకేష్ చెప్పారు. అమరావతితో సహా చంద్రబాబు తెచ్చిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన జగన్ రెడ్డి… నిజంగా అవి మా బ్రాండ్లు అయితే రద్దు చెయ్యకుండా ఉండేవారా? అని ఎదురు ప్రశ్నించారు.

చెత్త బ్రాండ్లు తెచ్చింది జగన్ ప్రభుత్వమేనని,  వైసీపీ హాయాంలో 141 కోత్త బ్రాండ్ లు వచ్చాయని ప్రభుత్వమే ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చిందాని పేర్కొన్నారు.  సభ లో చర్చకు అనుమతి ఇస్తే జే బ్రాండ్స్ బాగోతం బయటపడుతుందన్నారు.  మండలి ఛైర్మెన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని లోకేష్ ఆరోపించారు.

Also Read : సిఆర్డీయే రద్దు చెల్లదు: హైకోర్టు ఆదేశం

RELATED ARTICLES

Most Popular

న్యూస్