Wednesday, April 17, 2024
HomeTrending Newsహైదరాబాద్ కు వైద్య పరికరాల సంస్థ

హైదరాబాద్ కు వైద్య పరికరాల సంస్థ

Confluent Medical  : ప్రపంచ ప్రఖ్యాత వైద్య పరికరాల (మెడికల్ డివైజెస్)తయారీ కంపెనీ కన్ఫ్లోయాంట్ మెడికల్ (Confluent Medical) సంస్థ హైదరాబాద్ లో తన తయారీ యూనిట్ ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. త్వరలో పైలట్ ప్రాతిపదికన ఒక తయారీ యూనిట్ ని మొదలు పెట్టి 12 నెలల్లో దాని భారీగా విస్తరించేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. కంపెనీ నింతోల్ ఉత్పత్తుల తయారీ కోసం అగ్రశ్రేణి సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్ నగరానికి తీసుకురానుంది. దేశంలో ఈ స్థాయి టెక్నాలజీతో ఉత్పత్తులను తయారు చేసే మొదటి కంపెనీ కన్ఫ్లోయాంట్ మెడికల్ గా నిలవనున్నది. దేశంలోని మెడికల్ డివైసెస్ తయారీ కంపెనీలకు తన ఉత్పత్తుల ఆధారంగా సేవలను అందించనుంది. హైదరాబాదులో స్థాపించబోయే తన తయారీ యూనిట్ ద్వారా భారతదేశంతో పాటు ఆసియా ఖండంలోని తన ఖాతాదారులకు తన ఉత్పత్తులను సరఫరా చేయనున్నది.

కన్ఫ్లోయాంట్ మెడికల్ సంస్థ అధ్యక్షులు మరియు సీఈవో అయిన డీన్ షావర్(Dean Schauer) ఈరోజు అమెరికాలోని శాన్ హో నగరంలో మంత్రి కేటీఆర్ తో సమావేశం అయ్యి తమ సంస్థకు సంబంధించిన యూనిట్ ఏర్పాటు ప్రకటనను చేశారు. భారతదేశానికి తొలిసారిగా అత్యంత ఆధునాతన టెక్నాలజీ ని తీసుకురావాలన్న లక్ష్యంతో హైదరాబాద్ నగరాన్ని తమ గమ్యస్థానంగా ఎంచుకున్నామని, భవిష్యత్తులో తమ కంపెనీని భారీగా విస్తరించే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని మంత్రి కేటీఆర్ కి తెలిపారు. త్వరలోనే తమ కంపెనీ బయోమెడికల్ టెక్స్టైల్ సేవలకు సంబంధించి ప్రణాళికలను ప్రకటిస్తామని తెలిపారు.

తమ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్న కన్ఫ్లోయాంట్ మెడికల్ టెక్నాలజీ సంస్థకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం మెడ్ టెక్ ప్రధాన రంగాల్లో మెడ్ టెక్ రంగం ఒకటని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సంస్థ తయారీ ప్లాంట్ యూనిట్ కి సంబంధించి అన్ని రకాల సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తామని భవిష్యత్తులో సంస్థతో తెలంగాణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పని చేద్దామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి కే. తారకరామారావుతో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయెష్ రంజన్, డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి నాగప్పన్ లు పాల్గొన్నారు.

ఫార్మ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు చెందిన కీలక కంపెనీల ప్రతినిధులతో అమెరికాలో మంత్రి కే. తారక రామారావు రౌండ్ టేబుల్ సమావేశం

మంత్రి కే. తారకరామారావు ఈరోజు ఫార్మ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు చెందిన కీలక కంపెనీల ప్రతినిధులతో అమెరికాలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ తెలంగాణలోని లైఫ్ సైన్సెస్ మరియు బయోటెక్నాలజీ రంగాల్లో ఉన్న అవకాశాలపైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో పరిశోధన మరియు అభివృద్ధి, డిజిటల్, టెక్ కేంద్రాల ఏర్పాటు, తయారీ కార్యకలాపాలకు సంబంధించి అనేక అవకాశాలు ఉన్నట్లు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన పలు కంపెనీల ప్రతినిధులు మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పట్ల సానుకూలంగా స్పందించి తమ భవిష్యత్తు కంపెనీల, విస్తరణ పెట్టుబడుల విషయంలో తెలంగాణను సానుకూలంగా పరిశీలిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగంలో అభివృద్ధి మరియు పరిశోధన ఇన్నోవేషన్ వంటి రంగాల్లో అద్భుతమైన నిర్ణయాలతో పాటు మౌలిక వసతుల కల్పన చేస్తున్నామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైసెస్ పార్క్,త్వరలో ప్రారంభం కానున్న హైదరాబాద్ ఫార్మాసిటీ వంటి ఈ ప్రాంతాల్లో ఈ రంగానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి సమావేశానికి హాజరైన వివిధ ప్రముఖ కంపెనీల ప్రతినిధుల నుంచి అత్యంత సానుకూల స్పందన లభించింది.
ఈ సమావేశంలో మంత్రి కే. తారకరామారావుతో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయెష్ రంజన్, డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి నాగప్పన్ లు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి: నిరుద్యోగులకు తీపి కబురు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్