Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఐపీఎల్: హైదరాబాద్ పై రాజస్థాన్ విజయం

ఐపీఎల్: హైదరాబాద్ పై రాజస్థాన్ విజయం

IPL-2022: గత రెండు సీజన్లుగా అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తూ వస్తోన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి కూడా అదే ఆటతీరుతో ఈ సీజన్ మొదలు పెట్టింది. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 61 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది.

పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ దూకుడుగా ఆట మొదలు పెట్టి తొలి వికెట్ కు 58 పరుగులు జోడించింది. జైశ్వాల్ 20 పరుగులు చేసి అవుట్ కాగా, మరో ఓపెనర్ జోస్ బట్లర్ 35 స్కోరు చేసి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. మూడో వికెట్ కు సంజూ శ్యామ్సన్- పడిక్కల్ కలిసి 73 పరుగులు జోడించారు.  సంజూ 27 బంతుల్లో 3ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 55;  పడిక్కల్ 29 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లతో 41; చివర్లో హెట్మేయిర్ కేవలం 13  బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు చేసి హైదరాబాద్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.  హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ చెరో రెండు; భువీ, షెఫర్డ్ చెరో వికెట్ సాధించారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ మూడు పరుగుల వద్ద కెప్టెన్ విలియమ్సన్(3) వికెట్ కోల్పోయింది. స్కోరు 7 వద్ద రాహుల్ త్రిపాఠి డకౌట్ కాగా, 9 వద్ద నికోలస్ పూరణ్ కూడా డకౌట్ గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ అభిషేక్ వర్మ కూడా కేవలం 9 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. జట్టులో మార్ క్రమ్-57 పరుగులతో అజేయంగా నిలవగా, వాషింగ్టన్ సుందర్ 14  బంతుల్లో 5  ఫోర్లు, 2  సిక్సర్లతో 40 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.రోమానియో షెఫర్డ్-24స్కోరు చేశాడు. 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 149 పరుగులు హైదరాబాద్ చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో యజువేంద్ర చాహల్ మూడు; ప్రసిద్ కృష్ణ, బౌల్ట్ చెరో రెండు వికెట్లు తీశారు.

సంజూ శ్యామ్సన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read :ఐపీఎల్: లక్నోపై గుజరాత్ విజయం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్