Monday, June 17, 2024
Homeసినిమావిజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్లో ‘జేజీఎం’ (జనగణ మన)

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్లో ‘జేజీఎం’ (జనగణ మన)

JGM: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో జేజీఎం (జ‌న‌గ‌ణ‌మ‌న‌) చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని3.08.2023న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజు ముంబైలో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తమ తదుపరి వెంచర్ “JGM”ని గ్రాండ్గా ప్రారంభించారు. హెలికాప్టర్ ఛాపర్ లో పత్యేకంగా దిగిన విజయ్ దేవరకొండ వాకింగ్ స్టయిల్, ఆర్మీ గెటప్ తో పాత్రపరంగా చాలా ఫర్ఫెక్ట్ గా వున్నాడు. వినూత్నంగా ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఓపెనింగ్ ప్రత్యేకతను సంతరించుకుంది.


ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాతలు ఛార్మి కౌర్, వంశీ పైడిపల్లి మరియు శ్రీకర స్టూడియోస్ డైరెక్టర్ సింగారావు పాల్గొన్నారు. ఇక ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ లో ఇండియా మ్యాప్ తో పాటు కొందరు సైనికులు కనిపించారు. యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం వుంటుందని తెలుస్తోంది. విజయ్ లుక్ కు నెటిజన్ అభిమానులు ఫిదా అయ్యారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూరి జగన్నాధ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్లో ఛార్మీ కౌర్, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం JGM.. యాక్షన్ ఎంటర్టైనర్ గా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ఇది.

ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించనున్న ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ 2022లో ప్రారంభమవుతుంది. జేజీఎం చిత్రాన్ని పూరి కనెక్ట్ & శ్రీకర స్టూడియో ప్రొడక్షన్ లో ఛార్మి కౌర్, వంశీ పైడిపల్లి నిర్మిస్తున్నారు.

Also Read : విజ‌య్ తో శివ మూవీ క్యాన్సిల్ అయ్యిందా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్