Saturday, September 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఏది క్షుద్రం? ఏది పవిత్రం?

ఏది క్షుద్రం? ఏది పవిత్రం?

Pooja-Controversy:
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ క్షుద్రపూజల్లాంటివేవో చేశాడట.
స్వయంగా డాక్టర్, పైగా హెల్త్ డైరెక్టర్.
ఆయన పోయి ఈ క్షుద్రపూజలు చేయడం ఏంటి?
ఈ విమర్శకి ఆయన సమాధానం చెప్పుకోవాలి.
చాలా కాలం క్రితం ఒక ఛానెల్ ఛీఫ్ ఎడిటర్ గా ఇలాంటిదే ఒక పెద్ద గొడవ.
అప్పటి పోలీసు ఉన్నతాధికారి కూడా ఇలాంటి పూజలే చేశాడట.
ఆ చానెల్ మేనేజమెంట్ కి, ఆ డిజిపి కి అప్పటికే ఏవో గొడవలున్నాయి.
ఇదే ఛాన్సని చానెల్ వార్తని పదే పదే వేసింది.
ఇదే ఛాన్సని ఆ అధికారి కూడా వరసగా ఛానెల్ సిబ్బందిని అరెస్టులు చేస్తూ పోయాడు.
ఛానెల్ కూడా ఆ దెబ్బకి మూత పడింది.
ఇప్పుడు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ కి అంత శక్తి సామర్థ్యాలు లేకపోవచ్చు.
కాకపోతే, ఎప్పుడైనా ఇదే సీన్..


క్షుద్రపూజలనగానే మీడియా చెలరేగిపోతుంది.
హేతువాదులు, నాస్తికులేకాదు..
భక్తులు, ఆస్తికులు కూడా ‘తప్పు కదా’ అని ముక్కున వేలేసుకుంటారు.
కానీ, మౌలిక ప్రశ్న ఒకటుంది
ఏది నమ్మకం, ఏది మూఢనమ్మకం.
ఏది పూజ, ఏది క్షుద్ర పూజ
ఏది మంత్రం , ఏది తంత్రం
ఏది దైవం.. ఏది భూతం
ఏ దేవుడు నమ్మకం?
ఏ భక్తి మూఢనమ్మకం?

Pooja
దేవుడెక్కడున్నాడు?
గుండెలోనా గుడిలోనా?
గోడ మీద బొమ్మలోనా?
నేల మీద రాయిలోనా?
రాయికి మొక్కి ప్రసాదం పెట్టడం నమ్మకమా? మూఢనమ్మకమా?
ఏ పూజ దైవత్వం, ఏ పూజ అమాయకత్వం?
ఏది మొక్కుబడి, ఏది చేతబడి?
దైవాంశసంభూతులెవరు? దొంగబాబాలెవరు?
మహిమలెవరివి? మాయలెవరివి?
ఈ తేడాలు సృష్టించిందెవరు?
ఈ గీతలు గీసిందెవరు?
ఈ గోడలు నిర్మించిందెవరు?

లౌకిక రాజ్యాంగంలో ప్రభుత్వాధినేతలే గుళ్లు కట్టి యజ్ఞయాగాదులు చేయడం మంచి నమ్మకమా?
అంతరిక్షానికి రాకెట్లు పంపే శాస్త్రవేత్తలు అంతకు ముందురోజు గుళ్ళో పూజలు చేయడం నమ్మకమా? మూఢనమ్మకమా?
యూనివర్శిటీల్లో జ్యోతిష్యాలమీద అధ్యయనాలు చేయడం ఏం విశ్వాసం.
కొండ మీద గుండు కొట్టించుకోవడం మంచి నమ్మకమా?
కొండకింద జుట్టు విరబోసుకోవడం మూఢనమ్మకమా?
జాతకాలు, జో్తిష్యాలు, వాస్తులకి శాస్త్రం అని తగిలించినంత మాత్రాన శాస్త్రాలవుతాయా?
హేతువు కానిదే నమ్మకం
అర్థం కానిదే భయం.
అది దేవుడైనా, దెయ్యమైనా ఒకటే.
మరి ఈ భక్తి, మూఢ భక్తి తేడాలెలా వచ్చాయి.

Pooja
ఇదొక ఆధిపత్య కుట్ర.
దేవుడు, పూజలు, భక్తి..
వీటన్నిటి మీదా కొన్ని కులాలకే ఆధిపత్యాన్ని రాసిచ్చేసిన కుట్ర.
వాళ్ళు కాక ఎవరు చేసినా దాన్ని క్షుద్రపూజే..
వీరి దగ్గరకి ఎవరు వెళ్ళినా అది మూఢభక్తే.
ఇదే హెల్త్ డైరెక్టర్ ఏ పీఠాధిపతి దగ్గరకో, ఏ సోకాల్డ్ పుణ్యక్షేత్రానికో వెళ్తే ఇంతలా విరుచుకుపడేవాళ్లా?
ఏదో పల్లెలో, ఓ గిరిజన మహిళ తనకి తోచిన రీతిలో చేసేపూజలు మాత్రం అవి క్షుద్రపూజలా?.
దానికి అతను బోనులో నిలబడాలా?.

-శివప్రసాద్

Also Read :

మా పిల్లలు బంగారం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్