Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్కొరియా ఓపెన్:  బరిలో నిలిచిన సింధు, శ్రీకాంత్

కొరియా ఓపెన్:  బరిలో నిలిచిన సింధు, శ్రీకాంత్

Korea Open-2022: కొరియా ఓపెన్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ఆటగాళ్ళు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్ లో విజయం సాధించి బరిలో నిలిచారు. పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జంట కూడా విజయం సాధించింది. లక్ష్య సేన్ తో సహా మిగిలిన ఆటగాళ్ళు రెండో రౌండ్లో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.

జపాన్ క్రీడాకారిణి ఆయ ఒహోరిపై 21-15; 21-10 తేడాతో సింధు విజయం సాధించింది. శ్రీకాంత్  21-18; 21-6 తేడాతో ఇజ్రాయెల్ ఆటగాడు మిషా జిల్బెర్మాన్ పై గెలుపొందాడు. సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జంట సింగపూర్ జోడీ పై 21-15;21-19 తో విజయం సాధించి మూడో రౌండ్లోకి ప్రవేశించారు.

ఇటీవలి కాలంలో మంచి ఫామ్ ప్రదర్శిస్తోన్న లక్ష్య సేన్, ఇండోనేషియా ఆటగాడు శేసర్ హిరెన్ చేతిలో 22-20; 21-9  తో ఓటమి పాలయ్యాడు. థాయ్ లాండ్ క్రీడాకారిణి పొన్పావే చోచువాంగ్ చేతిలో 21-8; 21-14 తో మాళవిక బన్సోద్ ఓటమి పాలైంది.

పురుషుల డబుల్స్ లో ఎమ్మార్ అర్జున్, ధృవ్ జంట ఇండోనేషియా జోడీ చేతిలో ఓటమి పాలయ్యారు. స్కోరు 8-5 ఉన్నప్పుడు గాయం కారణంగా ఇండియా క్రీడాకారులు  తప్పుకోవడంతో ప్రత్యర్థి జంట ప్రీ క్వార్టర్స్ లోకి ప్రవేశించింది.

మిక్స్డ్ డబుల్స్ లో అశ్విని పొన్నప్ప-సుమిత్ రెడ్డి జోడీ చైనాకు చెందిన జంట చేతిలో 20-22; 21-18; 14-21 తో ఓడిపోయారు.

Also Read :  కొరియా ఓపెన్: తొలి రౌండ్లో సింధు, శ్రీకాంత్ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్