పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈ నెల 8వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం సమావేశాలను ముందుగానే ముగించింది. గురువారం సభ ప్రారంభమైన వెంటనే.. సమావేశాలను ముగిస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. రెండు విడుతలు జరిగిన బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సితారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ఫిబ్రవరి 11న మొదటి విడత సమావేశాలు ముగిశాయి. ఆ తరువాత యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. మార్చి 10న ఫలితాలు వెలువడ్డాయి. అనంతరం.. అనంతరం ఫిబ్రవరి 11న మొదటి విడత సమావేశాలు ముగిశాయి. మళ్లీ మార్చి 14న రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం రేపు ( ఏప్రిల్ 8న) సమావేశాలు ముగియాల్సి ఉన్నది. అయితే ఒక రోజు ముందుగా ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
ఈ సమావేశాల్లో రాజ్యసభ మెరుగైన పనితీరు కనబరిచింది. 99.80 శాతం ఉత్పాదకతను సాధించిందని అధికారులు తెలిపారు. 10 నిమిషాల తేడాతో వంద శాతం ఉత్పాదకత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. 2017 వర్షాకాల సమావేశాల తర్వాత రాజ్యసభ పనితీరు ఇంత మెరుగ్గా ఉండటం ఇదే తొలిసారి. సభ వాయిదా అనంతరం.. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ములాయంసింగ్ యాదవ్ కాసేపు పార్లమెంటు ఆవరణలో సమావేశమై వేర్వేరు అంశాలపై మాట్లాడుకున్నారు.
Also Read : రాజ్యసభలో 72 మంది ఎంపీలకు వీడ్కోలు