తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు తానూ రాజకీయం చేస్తున్నానని అనవసరంగా విమర్శిస్తున్నారని గవర్నర్ తమిళ్ సై అసహనం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా అర్థరహితంగా విమర్శిస్తున్నారన్నారు. ఢిల్లీ లో ఈ రోజు ఓ కేంద్రమంత్రి కుమారుడి వివాహానికి హాజరైన గవర్నర్ విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా విమర్శించారని అన్నారు. పాత వీడియోలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని, తాను ప్రజల సమస్యలను పరిష్కరించటం తప్పా అని ప్రశ్నించారు. ప్రజలను కలిస్తే తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని, ఏ పదవిలో ఉన్నా, ప్రజలకు సేవ చేయుటo తన లక్ష్యం అని స్పష్టం చేశారు.
ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేంద్రం తన పని చేసుకు పోతోందని, గిరిజనుల మంచి కోసం వాళ్ళ ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని గవర్నర్ వెల్లడించారు. ఆహ్వానాలను పొలిటికల్ గా చూడొద్దని, తాను ప్రభుత్వాన్ని రద్దు చేస్తా అనలేదని వివరణ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ తో విభేదించినా, రాజ్ భవన్ కు గౌరవిస్తున్నారని, తాను తెలంగాణ గవర్నర్ గా మాత్రమే పని చేస్తున్నానని చెప్పారు. రాజకీయం చెయ్యాల్సిన అవసరం లేదు.. చెయ్యాలనే ఆలోచన లేదన్నారు. గవర్నర్ పదవి ఇవ్వడానికి చాలా అర్హతలు చూస్తారని, గవర్నర్ గా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానిల మద్దతు ఉంటుందని, సెలవులు తీసుకోకుండా పనిచేస్తున్నానని తమిలి సై పేర్కొన్నారు.
Also Read : ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై అసంతృప్తి