Monday, June 15, 2026
Homeసినిమాప్ర‌భాస్, మారుతి మూవీ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

ప్ర‌భాస్, మారుతి మూవీ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

Make it Fast: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్  ప్ర‌స్తుతం స‌లార్, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్ కే చిత్రాలు చేస్తున్నారు. ఈ సినిమాల‌తో పాటు అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ష‌న్ లో స్పిరిట్ అనే భారీ చిత్రం కూడా చేసేందుకు ఓకే చెప్పారు. అయితే.. గ‌త కొన్ని రోజులుగా ప్ర‌భాస్.. మారుతితో సినిమా చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి కానీ.. అఫిషియ‌ల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. ఈ నెల 10న సినిమా ప్రారంభిస్తార‌ని టాక్ వినిపించింది కానీ.. ఎలాంటి అప్ డేట్ రాలేదు.

తాజా వార్త ఏంటంటే.. స్టోరీ ఫైన‌ల్ అయ్యింద‌ని.. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ని తెలిసింది. ఈ సినిమా కోసం హైద‌రాబాద్లో 18000 చ‌ద‌ర‌పు అడుగుల్లో ప్ర‌త్యేకంగా.. భారీగా ఇంటి సెట్ రూపొందిస్తున్నారు. దాదాపుగా షూటింగ్ ఈ ఇంటి సెట్ లోనే ఉంటుంద‌ని స‌మాచారం. ప్ర‌భాస్ సినిమాలు బాగా ఆల‌స్యం అవుతున్నాయి. అందుక‌నే చాలా ఫాస్ట్ గా తీసేలా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఆరు నెల‌ల్లో ఈ సినిమా కంప్లీట్ చేయాల‌నేది ప్లాన్. అయితే.. ఎప్పుడు ఈ సినిమాని స్టార్ట్ చేస్తారు..?  ఎప్పుడు రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు..?  అనేది త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తార‌ని టాక్.

Also Read : స‌లార్ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular