Tuesday, September 24, 2024
HomeTrending Newsజీనోమ్ ఎడిటింగ్ పై వర్క్ షాప్

జీనోమ్ ఎడిటింగ్ పై వర్క్ షాప్

Genome Editing : జీనోమ్ ఎడిటింగ్ ఫర్ క్రాప్ ఇంప్రూవ్ మెంట్ పొటెన్షియల్ అండ్ పాలసీ అన్నఅంశం పై శుక్రవారం రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వర్క్ షాప్ జరిగింది. పీజెటీఎస్ఏయూ, బయోటెక్ కన్సార్టియం ఇండియా లిమిటెడ్ లు సంయుక్తంగా దీనిని నిర్వహించాయి.శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులు, విద్యార్ధులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఇప్పుడు చైనా, అమెరికా వంటి దేశాలు జీనోమ్ ఎడిటింగ్ పై ప్రత్యేక శ్రధ్ధ పెట్టాయని బయోటెక్ కన్సార్టియం ఇండియా లిమిటెడ్ చీఫ్ జనరల్ మేనేజర్ విభా అహుజా అన్నారు.

భారత ప్రభుత్వం ఈ అంశం పై పరిశోధనల్నిప్రోత్సహిస్తుందన్నారు. అందులో భాగంగానే తొలత పీజెటీఎస్ఏయూలోనే ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో ఇతర యూనివర్శిటీల్లోనూ ఇలాంటి వర్క్ షాపులను నిర్వహిస్తామని అహుజా తెలిపారు. ఈ టెక్నాలజీని 25 దేశాల్లో 40 పంటల్లో వినియోగిస్తున్నారని వర్క్ షాప్ లో కీలకోపన్యాసం చేసిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ డైరెక్టర్ ఆర్ఎం సుందరం తెలిపారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వాతావణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లని ఈ నూతనటెక్నాలజీ వల్ల పరిష్కరించే అవకాశం కలుగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. నూనె గింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకతలు పెంచుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగ పడుతుందని సుందరం అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడానికి యువతని వ్యవసాయం వైపు ఆకర్షితుల్ని చేయడానికి కొత్త టెక్నాలజీలు సాయపడతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖస్పెషల్ కమిషనర్ హనుమంతు తెలిపారు. అదే సమయంలో ఇటువంటి టెక్నాలజీపై తలెత్తే ఆందోళనల్ని నివ`త్తి చేయడం పైనా ప్రత్యేక ద`ష్టి పెట్టాలని సూచించారు.
లోతైన పరిశోధనలు నిర్వహించి, భాగస్వాములందరి అభిప్రాయాల్ని తీసుకుని ఇటువంటి టెక్నాలజీ విషయంలో ముందుకెళ్లాలని హనుమంతు తెలిపారు. సామాన్యుడికి ఉపయోగపడే ఏటెక్నాలజీ అయినా స్వాగతించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూచెబుతుంటారని వర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి.ప్రవీణ్ కుమార్ అన్నారు. అదే విధంగా ఇటువంటి నూతన టెక్నాలజీల వల్ల ధనిక, పేద అన్నఅంతరం పెరగకుండా చూడాలన్నారు. ఇటువంటి కొత్త టెక్నాలజీల గురించి పాఠశాల స్ధాయి నుంచే అవగాహన పెంపొందించాలన్నారు. ప్రపంచంలో వస్తున్నకొత్త టెక్నాలజీల నుంచి పారిపోకూడదన్నారు. పత్తిలో హైడెన్సిటీ సాగుపై వర్శిటీ విస్త`త పరిశోధనలు సాగిస్తుందని ప్రవీణ్ రావు వివరించారు. మరో వైపు రాశిసీడ్స్, పీజెటీఎస్ఏయూల మధ్య ఇదే కార్యక్రమంలో ఒక అవగాహన ఒప్పందంకుదిరింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్