Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్కోల్ కతాపై లక్నో ఘన విజయం

కోల్ కతాపై లక్నో ఘన విజయం

Lucknow landslide victory: బౌలర్లు సమిష్టిగా రాణించడంతో నేడు జరిగిన రెండో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో విసిరిన 177 పరుగుల లక్ష్య సాధనలో 14.3 ఓవర్లలో 101 పరుగులకే కోల్ కతా అల్లౌట్ అయ్యింది.

పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్ కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నో ఆటగాళ్ళు డికాక్(50); దీపక్ హుడా (41); మార్కస్ స్టోనిస్ (28); క్రునాల్ పాండ్యా (25); చివర్లో హోల్డర్ నాలుగు బంతుల్లో రెండు సిక్సర్లతో 13 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176  పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ రెండు; టిమ్ సౌతీ, శివమ్ మావి, సునీల్ నరేన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

కోల్ కతా 25 పరుగులకే నాలుగు వికెట్లు (ఇంద్రజీత్ డకౌట్;  శ్రేయాస్ అయ్యర్-6; ఆరోన్ పింఛ్-14; నితీష్ రానా-2) కోల్పోయి కష్టాల్లో పడింది. ఆండ్రీ రస్సెల్ ఒక్కడే 45 పరుగులతో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. సునీల్ నరేన్ 22 పరుగులు చేశాడు. జట్టులో ముగ్గురు డకౌట్ కాగా ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు, 14.3 ఓవర్లలోనే కోల్ కతా ఆలౌట్ అయ్యింది.

లక్నో బౌలర్లలో అవేష్ ఖాన్, జేసన్ హోల్డర్ చెరో మూడు; మోసిన్ ఖాన్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్ తలా ఒక వికెట్ సాధించారు.

అవేష్ ఖాన్ కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : కోల్ కతాపై ఢిల్లీ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్