Monday, June 8, 2026
Homeసినిమా'రామారావు ఆన్ డ్యూటీ' నుండి 'సొట్టల బుగ్గల్లో' పాట విడుదల

‘రామారావు ఆన్ డ్యూటీ’ నుండి ‘సొట్టల బుగ్గల్లో’ పాట విడుదల

Sottala Buggallo: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో రూపొందుతోంది. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమౌతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

మ్యూజికల్ ప్రమోషన్స్‌ లో భాగంగా రవితేజ, దివ్యాంశ కౌశిక్‌ల పై చిత్రీకరించిన సెకండ్ సింగిల్ ‘సొట్టల బుగ్గల్లో’ సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. ఈ పాట కోసం సంగీత దర్శకుడు సామ్ సిఎస్ అందమైన రొమాంటిక్ మెలోడీ ట్యూన్ కంపోజ్ చేశారు. ఈ పాటలో రవితేజ, దివ్యాంశ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. రవితేజ స్టైలిష్‌గా కనిపించగా, దివ్యాన్ష చీరలో అందంగా కనిపించింది. పాటలో విజువల్స్ లావిష్ గా వున్నాయి. రవితేజ్ చేసిన క్లాసీ డ్యాన్స్ స్టెప్స్ కూడా అభిమానులను అలరించాయి.

కళ్యాణ్ చక్రవర్తి చక్కని సాహిత్యం అందించగా, హరిప్రియ, నకుల్ అభ్యంకర్ లవ్లీగా ఈ పాటని ఆలపించారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ  చిత్రం జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular