Sunday, March 15, 2026
Homeసినిమాకలర్స్ స్వాతి ‘ఇడియట్స్’ ఫస్ట్ లుక్

కలర్స్ స్వాతి ‘ఇడియట్స్’ ఫస్ట్ లుక్

Idiots: ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా, రావణాసురుడు, డెవిల్ వంటి భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకీ ప్రాధాన్యత ఇస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ నుండి తాజా ప్రొడక్షన్ వెంచర్ అమోఘ ఆర్ట్స్, ఎమ్‌ఎన్‌ఓపి కలిసి నిర్మిస్తున్న  చిత్రానికి ‘ఇడియట్స్’ అనే క్రేజీ టైటిల్ ని ఖారారు చేశారు. రియల్ హీరోస్ అనేది ఉప శీర్షిక. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.

కలర్స్ స్వాతి రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఇడియట్స్’  తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో వినోదాత్మక అంశాలతో కూడిన స్వచ్చమైన ప్రేమకథగా ఉండబోతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రముఖ తారాగణం అంతా క్యారికేచర్‌ డిజైన్ లో ప్రతి పాత్ర విభిన్న భావోద్వేగాలతో కనిపించడం గమనించవచ్చు.  స్వాతితో పాటు నిఖిల్ దేవాదుల, సిద్ధార్థ్ శర్మ, శ్రీ హర్ష మరికొన్ని పాత్రలు ఫస్ట్ లుక్ పోస్టర్ లో కనిపించాయి. పల్లెటూరి నేపధ్యంలో ఫస్ట్ లుక్ ప్లజంట్ గా వుంది. మ‌రి.. ఈ సినిమా క‌ల‌ర్స్ స్వాతికి విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular