సాయుధ రైతాంగ పోరాటాల ద్వారానే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించిందని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నైజాం నిరంకుశత్వపై మొదలైన తిరుగుబాటు సాయుధ రైతాంగ పోరాటంగా మారి ఉధృత రూపం దరిస్తున్న సమయంలో ఇది యావత్ భారత దేశానికి వ్యాప్తి చెందుతుందన్న భయంతోటే బ్రిటిష్ పాలకులు దేశం నుండి తోక ముడిచిరాన్నారు. అందుకు దివంగత బీమిరెడ్డి నరసింహా రెడ్డి చేసిన తిరుగుబాటు ప్రధాన కారణంగా నిలిచిందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నిర్మాత,మార్కిస్టు కమ్యూనిస్టు నేత
దివంగత బీమిరెడ్డి నరసింహా రెడ్డి 14 వ వర్ధంతిని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి మంత్రి జగదీష్ రెడ్డి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ నైజాం నిరంకుశత్వపై మొట్టమొదటి సారిగా తిరుగుబావుటా జరిపిన మొట్టమొదటి నేతగా దివంగత బి యన్ చరిత్ర సృష్టించారన్నారు.
పాత సూర్యాపేట తాలూకా తో పాటు తుంగతుర్తి, జనగామ ప్రాంతంలో ఇప్పటికీ బీమిరెడ్డిని కొలుస్తుంటారని ఆయన తెలిపారు.
తనకు జన్మనిచ్చిన అటువంటి ప్రాంతంలో గోదావరి నది జలాలతో సస్యశ్యామలం కావలన్నదే ఆయన తపన అన్నారు. ఆ తపన ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి సాకారం చేశారన్నారు. తాను నిర్మించిన పార్టీలో ఎన్ని కుట్రలు జరిగినా ప్రజల హృదయాలలో ఆయన చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించుకున్నారని ఆయన కొనియాడారు.యింకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,స్థానిక మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, టి ఆర్ యస్ రాష్ట్ర కార్యదర్శి వై వి తదితరులు పాల్గొన్నారు.
Also Read : అనుమతితో మాకేం సంబంధం: తలసాని