విశాఖ రూరల్ చినగడిలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సిందుకు ప్రభుత్వం రెండెకరాల భూమి కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పశు సంవర్ధక శాఖ నుంచి యువజన సర్వీసులు, క్రీడల శాఖకు ఈ భూమిని బదలాయిస్తూ ప్రభుత్వం అదేశాలించ్చింది. ఈ స్థలంలో సింధు బ్యాడ్మింటన్ అకాడమీ తో పాటు ఒక స్పోర్ట్స్ స్కూల్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. 2 ఎకరాల భూమిని ఉచితంగా ఇస్తున్నట్లు వెల్లడించింది.
అకాడమీని ఒక్కో దశలో 5 కోట్ల రూపాయల చొప్పున రెండు దశల్లో నిర్మాణాలు చేపడతామని సింధు ప్రభుతానికి తెలియజేసింది. సింధు తన అకాడమీ ద్వారా ప్రతిభావంతులు, ఔత్సాహికులైన పేద పిల్లలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.