Friday, April 19, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఫ్యాక్షన్ కు ఎప్పుడో స్వస్తి పలికాను : కాటసాని

ఫ్యాక్షన్ కు ఎప్పుడో స్వస్తి పలికాను : కాటసాని

పెసరవాయి జంట హత్యల కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని పాణ్యం శాసనసభ్యుడు, వైఎస్సార్సిపి నేత కాటసాని రామ్ భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. 2004లోనే దివంగత నేత వైఎస్సార్ సూచనలతో తాను ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలికానని చెప్పారు. ఈరోజు హత్యకు గురైన ఇద్దరూ వైఎస్సార్ పార్టీలోకి రావడానికి తనను సంప్రదించారని కాటసాని చెబుతూ దానికి సంబంధించిన ఆధారాలు వెల్లడించారు. వీరిద్దరూ ఇటీవలి కాలంలో పెసరవాయి సమస్యలు తనతో చెబితే పరిష్కరించానని చెప్పారు. జూన్ 7న ఒడ్డు ప్రతాప్ రెడ్డి తనతో మాట్లాడారని, ఇంతలోనే వారు హత్యకు గురికావడం షాక్ కు గురిచేసిందన్నారు.

పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలంలోని పెసరవాయ్ గ్రామంలో టిడిపి నాయకులు వడ్డునాగేశ్వర్ రెడ్డి ఆయన సోదరుడు ప్రతాపరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యలతో ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డికి సంబంధం ఉందని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు.

2009 ఎన్నికల్లో ఈ ఇద్దరు సోదరులు తనకు అనుకూలంగా పనిచేశారని చెప్పారు. ఆ తర్వాత తాను వైఎస్సార్ పార్టీలో చేరితే, వారు తెలుగుదేశం పార్టీలో చేరారని చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలని ఆ తర్వాత అభివృద్ధిపైనే దృష్టి పెడుతున్నామని చెప్పారు. చాలా కాలంగా పాణ్యంలో ఎదురులేని నాయకుడిగా ఉన్నానని, హత్యలు చేయించాల్సిన దుస్థితిలో తాను లేనన్నారు. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్నవారిని వదిలి పెట్టవద్దని, వైఎస్సార్ పార్టీ లో ఉన్నంత మాత్రాన ఈ హత్యలతో సంబంధం లేని వ్యక్తులను కేసులో ఇరికించి వారి భవిష్యత్తు పాడు చేయవద్దని కాటసాని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్