Thursday, March 28, 2024
HomeTrending Newsరైతులపై చంద్రబాబుది కపట ప్రేమ: సజ్జల

రైతులపై చంద్రబాబుది కపట ప్రేమ: సజ్జల

Sajjala Fire On Chandrababu Naidu For His Letter On Agricultural Issues :

రైతులపై చంద్రబాబు కపట ప్రేమ కురిపిస్తూ, అబద్ధాలు, అసత్యాలతో లేఖలు రాస్తున్నారని ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల దాకా పోదు అన్నట్టుగా.. చంద్రబాబు పుట్టుకతోనే అబద్ధాలు, అసత్యాలు వంటబట్టించుకున్నారని అన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో చూసిన చీకటి రోజులను రైతులు ఇంకా మరచిపోలేదని గుర్తు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన.. రైతుల్లో ఆత్మ విశ్వాసం నింపిందని, రైతులు తమ సొంత కాళ్లపై నిలబడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సజ్జల చెప్పారు.

వైఎస్‌ జగన్‌కు పాలనా అనుభవం లేకున్నా, నిజాయితీ, నిబద్ధత ఉన్నాయని, అతి తక్కువ కాలంలోనే సుపరిపాలన అందించి చూపించారని సజ్జల వివరించారు. చంద్రబాబుకు డెబ్భై ఏళ్లు వచ్చినా ఇంకా బుద్ధి రాలేదని తీవ్ర వ్యాఖలు చేశారు సజ్జల. ఆయన అద్దం ముందు తనను తాను చూసుకుంటే, ఆయన నిజ స్వరూపం ఏమిటో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ఈ భూ ప్రపంచంలో ఇలాంటి అబద్ధాలతో కూడిన అడ్డగోలు రాతలు రాయటం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం అవుతుందన్నారు చంద్రబాబు హయాంలో రైతులకు బకాయిలు పెట్టిన రూ.990 కోట్లను, ముఖ్యమంత్రిగా జగన్ గారు అధికారం చేపట్టగానే చెల్లించారని రైతులకు బకాయిలు పెట్టి, ఎగ్గొట్టడమే చంద్రబాబు ఘనత అని పేర్కొన్నారు.

రైతులలో లేని ఆందోళనను ఉన్నట్టుగా సృష్టించి చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు సజ్జల. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబుకు మతి చలించిందేమో అనే అనుమానం వస్తోందన్నారు.

ఇక రాష్ట్రంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి గైడ్ లైన్స్‌ ఇవ్వలేదని, ఒకవేళ వివరణ కోరితే నోటీసులు వచ్చాక తగురీతిలో స్పందిస్తామని వెల్లడించారు. విద్యార్థుల విషయంలో వైఎస్‌ జగన్‌ ఒక పేరెంట్‌గానే ఆలోచిస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తే ఈ ప్రభుత్వానికి ముఖ్యమని సజ్జల స్పష్టం చేశారు.

Also Read : కరోనా సంక్షోభంలోను సంక్షేమం : సజ్జల

RELATED ARTICLES

Most Popular

న్యూస్