Lost to Korea : బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అధ్వర్యంలో జరుతుతోన్న టోటల్ ఇంజనీర్స్ థామస్ ఉబెర్ కప్ ఫైనల్స్ -2022లో భాగంగా తొలి రెండు మ్యాచ్ ల్లో కెనడా, అమెరికాలపై 4-1తేడాతో విజయం సాధించిన భారత మహిళల జట్టు నేడు కొరియాతో జరిగిన మ్యాచ్ ను 5-0 తో చేజార్చుకుంది. నేడు జరిగిన మ్యాచ్ లో అస్మిత చలిహా ఒక్కరే ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వగలిగింది.
సింగిల్స్ విభాగంలో
పివి సింధుపై 21-15; 21-14 తేడాతో అన్ సె యంగ్…
ఆకర్షి కాశ్యప్ పై 21-10; 21-10 తేడాతో కిమ్ గా ఇయున్…
ఆశ్మిత చలిహా పై 21-18; 21-17 తో సిమ్ యూ జిన్ లు విజయం సాధించారు.
డబుల్స్ విభాగంలో
లీ సో హీ – శిన్ సేయుంగ్ చాన్ జోడీ చేతిలో 21-13;21-12 తో శృతి మిశ్రా- సిమ్రాన్ సింఘి పై …..
కిమ్ హే జియోంగ్- కాంగ్ హీ యాంగ్ జంట 12-14; 21-11 తేడాతో తానీషా క్రాస్టో-త్రెసా జాలీ పై గెలుపొందారు.
మొన్న కెనడాతో , నిన్న అమెరికాతో జరిగిన మ్యాచ్ ను 4-1 తేడాతో గెల్చుకొని ఇప్పటికే క్వార్టర్స్ కు చేరుకున్న ఇండియా గ్రూప్ డి విభాగంలో రెండో స్థానంలో నిలిచింది.
రేపు జరిగే క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో ఇండియా ఏ జట్టుతో తలపడనుందో సాయంత్రానికి తేలనుంది.
Also Read : ఉబెర్ కప్: అమెరికాపై ఇండియా గెలుపు