Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్ఉబెర్ కప్: కొరియా చేతిలో ఇండియా ఓటమి

ఉబెర్ కప్: కొరియా చేతిలో ఇండియా ఓటమి

Lost to Korea :  బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అధ్వర్యంలో జరుతుతోన్న టోటల్ ఇంజనీర్స్ థామస్ ఉబెర్ కప్ ఫైనల్స్ -2022లో భాగంగా  తొలి రెండు మ్యాచ్ ల్లో కెనడా, అమెరికాలపై 4-1తేడాతో విజయం సాధించిన భారత మహిళల జట్టు నేడు కొరియాతో జరిగిన మ్యాచ్ ను 5-0 తో చేజార్చుకుంది.  నేడు జరిగిన మ్యాచ్ లో అస్మిత చలిహా ఒక్కరే ప్రత్యర్థికి గట్టి పోటీ  ఇవ్వగలిగింది.

సింగిల్స్ విభాగంలో

పివి సింధుపై   21-15; 21-14 తేడాతో అన్ సె యంగ్…

ఆకర్షి కాశ్యప్ పై  21-10; 21-10 తేడాతో కిమ్ గా ఇయున్…

ఆశ్మిత చలిహా పై 21-18; 21-17 తో  సిమ్  యూ జిన్ లు విజయం సాధించారు.

డబుల్స్ విభాగంలో

లీ సో హీ – శిన్ సేయుంగ్ చాన్  జోడీ  చేతిలో 21-13;21-12 తో శృతి మిశ్రా- సిమ్రాన్ సింఘి పై …..

కిమ్ హే జియోంగ్- కాంగ్ హీ యాంగ్ జంట  12-14; 21-11  తేడాతో తానీషా క్రాస్టో-త్రెసా జాలీ పై గెలుపొందారు.

మొన్న కెనడాతో , నిన్న అమెరికాతో జరిగిన మ్యాచ్ ను 4-1 తేడాతో గెల్చుకొని ఇప్పటికే క్వార్టర్స్ కు చేరుకున్న ఇండియా  గ్రూప్ డి విభాగంలో రెండో స్థానంలో నిలిచింది.

రేపు జరిగే క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో ఇండియా ఏ జట్టుతో తలపడనుందో సాయంత్రానికి తేలనుంది.

Also Read : ఉబెర్ కప్: అమెరికాపై ఇండియా గెలుపు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్