Sunday, November 24, 2024
HomeTrending Newsజ్ఞానవాపి వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

జ్ఞానవాపి వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఉత్తరప్రదేశ్ వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయం పక్కనే ఆనుకుని ఉండే జ్ఞానవాపి మసీదులో సర్వేను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించనుంది. వారణాసి జిల్లా కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయయించింది. సుప్రీం కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంట నెలకొంది.

జ్ఞానవాపి మసీదులో హిందూ దేవుళ్ల సింబల్స్‌ను వెతకడానికి వీడియో సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. మూడు రోజుల వీడియోగ్రఫీ సర్వే సోమవారం ముగిసింది. ఆదివారం నాటికి ఈ సర్వే 65 శాతం ముగిసింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ సోమవారం ఉదయం చివరి రోజు వీడియోగ్రఫీ సర్వే మొదలు పెట్టారు. హిందూ మహిళల తరఫు న్యాయవాది విష్ణు జైన్ మీడియాతో మాట్లాడారు. మసీదు ఆవరణలోని ఓ బావిలో శివలింగం లభించినట్టు వెల్లడించారు. దీనికి సంపూర్ణ రక్షణ కల్పిచండానికి తాను సివిల్ కోర్టును ఆశ్రయించినునన్నట్టు తెలిపారు. జ్ఞానవాపి మసీదులో కనిపించిన శివలింగం 12 అడుగుల ఎత్తు ఉన్నదని, 8 ఇంచుల వ్యాసంతో ఉన్నదని వివరించారు. కోర్టు నియమించిన సర్వే కమిటీ మసీదును చేరగానే పెద్ద మొత్తంలో పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. మసీదులో ఓ కొలను వంటిది కనిపించిందని, ఇందులో పరిశుభ్రత ప్రక్రియకు ఉపయోగించారని తెలుస్తున్నదని లాయర్ సుభాష్ నందర్ చతుర్వేది తెలిపారు. జ్ఞానవాపి ప్రాంగణంలో శివలింగం ఉన్నట్టు సమాచారం బయటకు వచ్చిన గంటల వ్యవధిలోనే ఓ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ ఏరియాలోకి ఎవరినీ వెళ్లనివ్వకుండా సీల్ చేయాలని ఆదేశించింది.

సర్వే కమిషన్ పని ముగిసిందని ప్రభుత్వ తరఫు న్యాయవాది మహేంద్ర ప్రసాద్ పాండే తెలిపారు. మసీదులోని అన్ని ప్రాంతాలను తాము రికార్డు చేసినట్టు వివరించారు. మూడు డోమ్‌లు, అండర్‌గ్రౌండ్ బేస్‌మెంట్, కొలను, ఇతరత్రాలు అన్నింటిని వీడియో రికార్డు చేశామని చెప్పారు. ముగ్గురు కమిషనర్‌లతో కూడిన బృందం ఈ వీడియోను పరిశీలించనుండగా ఈ రిపోర్టు సకాలంలో పూర్తి కాకుంటే కోర్టు నుంచి మరికొంత సమయం అడుగుతామని చెప్పారు. ఈ ప్రక్రియ మొత్తం శాంతియుతంగా జరిగిందని వివరించారు. మసీదు వెనుకాలే ఉన్న హిందూ దేవుళ్ల విగ్రహాలకు ఏడాది మొత్తం పూజ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని ఐదుగురు హిందూ మహిళలు జిల్లా కోర్టును ఆశ్రయించారు. జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీకి చెందిన మహిళలు రాఖీ సింగ్, లక్ష్మీదేవి, సీతా సాహు తదితరులు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసును విచారణకు స్వీకరించిన వారణాసి జిల్లా కోర్టు వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు అడ్వొకేట్‌ కమిషనర్‌ను నియమించారు. మసీదు ప్రాంగణంలో పురావస్తు శాఖతో కలిసి వాస్తవాలను గుర్తించేందుకు సర్వే చేయాలని ఆదేశించింది. ఇక, కోర్టు ఆదేశాల మేరకు వీడియో తీసే ప్రయత్నం చేయగా.. శనివారం మసీదు నిర్వహణ కమిటీ, ముస్లింల నుంచి నిరసన, ఆందోళనలు వ్యక్తం కావడంతో కార్యక్రమం మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. అనంతరం కోర్టు వీడియో తీసి సర్వే చేయడానికి అనుమతులు ఇచ్చింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్