Sunday, February 23, 2025
Homeసినిమాచిరు మూవీలో నితిన్. ఇది నిజ‌మేనా..?

చిరు మూవీలో నితిన్. ఇది నిజ‌మేనా..?

Nitin got chance: మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాద‌ర్ మూవీ చేస్తున్నారు. అలాగే వాల్తేరు వీర‌య్య‌, భోళా శంక‌ర్ చిత్రాల్లో న‌టిస్తున్నారు. గాడ్ ఫాద‌ర్ మూవీలో స‌త్య‌దేవ్ ముఖ్య‌పాత్ర చేస్తున్నారు. ఆ పాత్రకి స‌త్య‌దేవ్ అయితేనే కరెక్టుగా సెట్ అవుతాడని చిరంజీవి స్వయంగా చెప్పడం విశేషం. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న గాడ్ ఫాద‌ర్ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇక ఆ తరువాత సినిమాగా చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమా చేస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ బాబీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో చిరంజీవి జాలరుల కుటుంబానికి చెందిన వ్యక్తి గా కనిపించనున్నారు. ఊర మాస్ లుక్ తో చిరంజీవి ఈ పాత్రలో కనిపించనున్నారు.  శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా ముఖ్యమైన పాత్ర కోసం మాస్ మ‌హారాజా రవితేజను తీసుకున్నారు. చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ సినిమా చేయడానికి రవితేజ ఒప్పుకున్నట్టుగా సమాచారం.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. చిరంజీవి, మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ష‌న్ లో భోళా శంకర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ తాజా షెడ్యూల్ 22 నుంచి స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటిస్తుండగా చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. ఆమె జోడీగా నితిన్ ను ఎంపిక చేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. గతంలో నితిన్, కీర్తి సురేశ్ జోడీ రంగ్ దే మూవీలో సందడి చేసింది. మెగా ఫ్యామిలీతో ఉన్న అభిమానంతో గెస్ట్ రోల్ చేయ‌డానికి నితిన్ ఓకే చెప్పాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. ఇది నిజ‌మేనా..?  కాదా.? అనేది తెలియాల్సివుంది.

Also Read చిరంజీవి గాడ్ ఫాద‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్