కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వరుసగా మూడో రోజైన బుధవారం కూడా విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. తొలి రెండు రోజులూ సుదీర్ఘంగానే విచారించిన ఈడీ అధికారులు బుధవారం కాస్తంత తక్కువగా 9 గంటల పాటు ఆయనను విచారించారు. ఈడీ విచారణలో యంగ్ ఇండియన్ సంస్థ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని రాహుల్ చెప్పినట్లు సమాచారం. యంగ్ ఇండియన్ లిమిటెడ్ (వైఐఎల్) లాభాపేక్షలేని దాతృసంస్థ అని, అది కంపెనీల చట్టంలోని ప్రత్యేక నిబంధన కింద ఏర్పడిందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
తొలి రెండు రోజుల మాదిరే బుధవారం కూడా రాహుల్‌ను మధ్యాహ్న భోజనం కోసం ఇంటికెళ్లేందుకు అనుమతించారు. మూడు రోజుల్లో 30 గంటలపాటు విచారించిన ఎన్ఫోర్సుమేంట్ డైరెక్టరేట్ అధికారులు రాహుల్ గాంధీని అనేక ప్రశ్నలు అడిగారు. రాహుల్ వాంగ్ములాన్ని (సమాధానాలను) రికార్డు చేశారు. ఇదిలా ఉంటే… నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో శుక్రవారం కూడా విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు రాహుల్ గాంధీకి సమన్లు అందించారు. బుధవారం విచారణ ముగిసిన తర్వాత ఈ మేరకు ఈడీ అధికారులు రాహుల్‌కు సమన్లు అందజేశారు. గురువారం విచారణకు విరామం ఇచ్చారు.
Also Read : ఈడీ ఆఫీస్‌కు రాహుల్ గాంధి