Tuesday, June 16, 2026
Homeస్పోర్ట్స్PV Sindhu-Prannoy: క్వార్టర్స్ కు సింధు, ప్రణయ్

PV Sindhu-Prannoy: క్వార్టర్స్ కు సింధు, ప్రణయ్

మలేషియా ఓపెన్ లో భారత ఆటగాళ్ళు పివి సింధు, హెచ్ ఎస్ ప్రన్నోయ్ లు క్వార్టర్స్ ఫైనల్స్ కు చేరుకున్నారు. నేడు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ ల్లో తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు. కాగా, పారుపల్లి కశ్యప్ మాత్రం రెండో రౌండ్లో ఓటమి పాలై టోర్నీ నుంచి వెనుదిరిగాడు.

మహిళల సింగల్స్ లో పివి సింధు 19-21; 21-9; 21-14తో  థాయ్ లాండ్ క్రీడాకారిణి చైవాన్ పై విజయం సాధించింది.

పురుషుల సింగిల్స్ లో  ప్రణయ్ 21-15; 21-7 తో నాలుగో సీడ్ ఆటగాడు, తైవాన్ కు చెందిన చొ టీన్ చెన్ పై గెలుపొందాడు.

పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ ఈ సాయంత్రం ప్రీ క్వార్టర్స్ ఫైనల్స్ మ్యాచ్ ఆడనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular