Friday, April 26, 2024
HomeTrending Newsటిఆర్ఎస్ ,బీజేపీ థర్డ్ క్లాస్ పంచాయతీ -కాంగ్రెస్ విమర్శ

టిఆర్ఎస్ ,బీజేపీ థర్డ్ క్లాస్ పంచాయతీ -కాంగ్రెస్ విమర్శ

భారతదేశం విస్తుపోయేలా అధికారాన్ని ఉపయోగించి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టిందని ఏఐసీసీ కార్యదర్శి, మహారాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కో ఆర్డినేటర్ సంపత్ కుమార్ విమర్శించారు. సీబీఐ, ఈడీ ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. సంపత్ కుమార్ ఈ రోజు హైదరాబాద్ గాంధి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి వైఖరిని దుయ్యబట్టారు.

బీజేపీ కుటిల రాజకీయాలు చేస్తోందని, మోడీ – అమిత్ షాల నీచ రాజకీయాలు మహారాష్ట్రలో పరాకాష్టకు చేరాయని సంపత్ కుమార్ ఆరోపించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇతర పార్టీలోకి వెళ్ళలేదని స్పష్టం చేశారు. శివసేన ఎమ్మెల్యే లను ఈడీ, సీబీఐ లతో బీజేపీ బెదిరించిందని, అస్సాం, కర్ణాటక, మధ్యప్రదేశ్ ,మహారాష్ట్ర లలో బీజేపీ ఇదే చేస్తుందన్నారు. తెలంగాణలో గోతికాడ నక్కాలా బీజేపీ అధికారం కోసం ఎదురుచూస్తోందన్నారు. అవినీతి కేసీఆర్ కుటుంబాన్ని జైలులో పెడతామన్న మాటలకు బీజేపీ నిలబడంతుందా అని సవాల్ విసిరారు.

తెలంగాణలో బీజేపీకి సంఖ్యా బలం లేనందున టిఆర్ఎస్ తో అంటకాగుతుందని, కేసీఆర్ అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో కార్యాచరణ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. బీజేపీ, టిఆర్ఎస్ ల మధ్య కటౌట్ ల పంచాయతీ.. థర్డ్ క్లాస్ పంచాయతీ చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాలుగా విఫలం అయ్యాయని, సమస్యలు పక్కదారి పట్టేందుకు టిఆర్ఎస్ ,బీజేపీ థర్డ్ క్లాస్ పంచాయతీ పెట్టుకున్నాయని కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ఎద్దేవా చేశారు.

Also Read : ఇది చీకటి ఒప్పందం : సంపత్

RELATED ARTICLES

Most Popular

న్యూస్