శ్రీలంక అధ్యక్ష భవనంలోనే ఆందోలనకారులు తిష్ట వేశారు. రెండు రోజులు గడుస్తున్నా ఆందోళనకారులు అధ్యక్ష భవనం వీడటం లేదు. మరోవైపు ప్రజలు కుటుంబాలతో కలిసి అధ్యక్ష భవనం సందర్శిస్తున్నారు. పరిస్థితులు చక్కదిద్దటం ఆర్మీ వల్ల కావటం లేదు. లోపాయికారిగా ఆర్మీ, పోలీసులు నిరసనకారులకు సహకరిస్తున్నారని పాశ్చాత్య మీడియా ప్రకటించింది. రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరెందుకు అవకాశాలు ఉన్నాయి. విపక్ష పార్టీలు అన్నింటితో కలిపి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కొలంబోలో చర్చలు జరుగుతున్నాయి.
తాజాగా ప్రధాని అధికారిక నివాసం (టెంపుల్ ట్రీ) లో కొందరు ఆందోళనకారులు హంగామా చేస్తూ కనిపించారు. ప్రధాని బెడ్ రూమ్ లోకి వెళ్లి అక్కడి బెడ్ పై WWE ఫైట్ చేస్తూ కనిపించారు. అచ్చు WWE ఫైట్ తరహా లోనే వారు పర్ఫార్మ్ చేశారు. ఇక అధ్యక్ష భవనంలో పలువురు నిరసనకారులు స్విమ్మింగ్ పూల్‌లో ఈతలు కొట్టడమే కాదు.. జిమ్ వర్కౌట్ చేస్తూ కనిపించారు. కాగా, కొందరు వంటలు చేస్తుంటే.. ఇంకొందరు డైనింగ్ రూమ్‌లో భుజించారు. ఇంకొందరైతే.. కాన్ఫరెన్స్ రూమ్‌లోకి వెళ్లి అధ్యక్షుడు రాజీనామా చేయాలని ప్రకటనలు విడుదల చేశారు. అలాగే, అధ్యక్ష భవనం లోని ఖరీదైన కార్ల వద్దకు వెళ్లి పలువురు సెల్ఫీలు తీసుకున్నారు.
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాసం వదిలి పారిపోవటం.. ప్రధానమంత్రి రణిల్ విక్రమ్ సింఘే రాజీనామా తరువాత పరిణామాల నేపథ్యంలో పొరుగు దేశంలోని ఆర్థిక సంక్షోభ పరిస్థితులపై భారత ప్రభుత్వ వైఖరిని కొందరు విలేకరులు అడిగారు. దీనికి కేంద్ర విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి అరిందమ్ బాగ్చి సమాధానం ఇచ్చారు. శ్రీలంకకు భారత్ రెండు దేశాలు లోతైన నాగరిక బంధాలను కలిగి ఉన్నాయని వివరించారు. శ్రీలంక, సింహళీయులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై తమకు అవగాహన ఉన్నదని తెలిపారు. ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తున్న శ్రీలంక ప్రజల వెంట భారత్ ఉన్నదని పేర్కొన్నారు.
Also Read : శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స పరార్