శ్రీలంకలో ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. పెరుగుతున్న ధరలు, చమురు సంక్షోభం, విద్యుత్ కోతలు ప్రజలను తీవ్ర అస్న్త్రుప్తికి గురి చేస్తున్నాయి. గత కొన్ని వారాలుగా కొలంబో లోని అధ్యక్ష భవనం ముందు నిరసన తెలుపుతున్న ఆందోళనకారులు దేశాధ్యక్షుడు గోటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులు ఒక్కసారిగా ఈ రోజు అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. వందలాది మంది నిరసనకారులు అధ్య్క్షభవనంలోకి దూసుకెళ్ళటంతో శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స పరార్ అయ్యారు. నిరసనకారులపై లంక సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగించి కాల్పులకు దిగిందని స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆందోళనకారులపై రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారా.. నిజమైన బుల్లెట్లు ఉపయోగించారా అనే విషయం తెలియరాలేదు.

 

Srilanka Protests Today

అధ్యక్షుడు గోటబాయ రాజపక్స, ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘెలు గద్దె దిగితేనే పరితితులు చక్కబడతాయని ప్రజల నుంచి డిమాండ్ పెరిగింది. ఆందోళనకారులకు తోడు సిలోన్ చర్చ్ కూడా అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. లంక ప్రజలను ప్రభావితం చేయకలిగిన సిలోన్ చర్చ్ పిలుపుతో ఆందోళనలు మరింత పెరిగాయి.

తమిళుల పట్ల, తమిళ ఈళం ఉద్యమకారులతో క్రూరంగా వ్యవహరించిన గోటబాయ రాజపక్స, రాణిల్ విక్రమసింఘేలు అధికారంలో ఉండటం భారత్ కు కొంత ఇబ్బందికర పరిణామం. ఈ ఇద్దరు నాయకులు భారత వ్యతిరేకత వ్యక్తం చేసినవారే కావటం గమనార్హం. చైనాతో సఖ్యంగా ఉండి దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టిన గోటబాయ రాజపక్స పట్ల లంక ప్రజల్లో సానుభూతి లేదు. గోటబాయ రాజపక్స, రాణిల్ విక్రమసింఘేలు గద్దె దిగితే భారత్ తరపున మరింత సాయం అందే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *