Sunday, June 7, 2026
Homeసినిమాఅందుకే వేణు అఖిల్ తో ప్లాన్ చేస్తున్నాడా..?

అందుకే వేణు అఖిల్ తో ప్లాన్ చేస్తున్నాడా..?

ఓ మై ఫ్రెండ్ చిత్రంతో దర్శకుడిగా పరిచయయ్యాడు వేణు శ్రీరామ్. తొలి సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో రెండో చిత్రానికి చాలా గ్యాప్ వచ్చింది. దాదాపు ఐదేళ్ల తర్వాత నేచుర‌ల్ స్టార్ నానితో ఎంసీఏ.. మిడిల్ క్లాస్ అబ్బాయ్ అనే సినిమా చేసి స‌క్సెస్ సాధించాడు.  ఆ తర్వాత  కూడా గ్యాప్ వచ్చింది. ఆ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ‘ఐకాన్ కనబడుటలేదు’ అనే సినిమాని ప్రకటించారు కానీ.. సెట్స్ పైకి రాలేదు.

కేవలం రెండు సినిమాల అనుభవంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. పింక్ రీమేక్ గా తెరకెక్కించిన వకీల్ సాబ్ సినిమా వేణు శ్రీరామ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. వసూళ్ళు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూపించిన విధానానికి ఫ్యాన్స్ అందరూ దర్శకుడిని మెచ్చుకున్నారు. అయినప్పటికీ… వ‌కీల్ సాబ్ త‌ర్వాత‌ ఈసారి కూడా గ్యాప్ వచ్చింది. ఐకాన్ చిత్రాన్ని తిరిగి బన్నీతో సెట్స్ మీదకు తీసుకురావాలని ప్రయత్నాలు చేసారు.

వేణు శ్రీరామ్ సైతం పలు ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే.. ఐకాన్ కోసం ఎదురు చూసిన దర్శక నిర్మాతలకు నిరాశే ఎదురైనట్లు టాక్. అందుక‌నే అఖిల్ తో వేణు శ్రీరామ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం క‌థాచ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం.

Also Read : అఖిల్ మూవీకి ప‌వ‌ర్ స్టార్ టైటిల్..? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular