Saturday, November 23, 2024
HomeTrending Newsధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం

ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం

Heavy Flow: తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం వద్ద నదీ ప్రవాహం ఉద్ధృతంగా ఉంది.  ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నీటిమట్టం 17.750 అడుగులకు చేరింది. 19.40 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.  ఇప్పటికే ఈ బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  175 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. దీంతో కోనసీమలోని ల్ 36లంక గ్రామాలు నీట మునిగాయి, ఇక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికార యంత్రాంగం తరలిస్తోంది.

మరోవైపు కాకినాడలో కూడా హై అలెర్ట్ జారీ చేశారు. యానాం లో గోదావరి ఉధృతికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎస్డీ ఆర్ ఎఫ్ బృందాలు పడవల్లో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  పునరావాస ప్రాంతాలకు రావడానికి నిరాకరిస్తున్నవారిని బలవంతంగా తీసుకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్