గవర్నర్ తమిళిసై రేపు భద్రాచలంలో పర్యటించనున్నరు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు బాధితులను పరామర్శించారునన్నారు. ఇందుకోసం గవర్నర్ ఈరోజు రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకొని.. అక్కడ నుంచి రైలులో భద్రాచలం వరకూ ప్రయాణించనున్నారు. భద్రాచలంతో పాటు సమీప ప్రాంతాలను సందర్శించి బాధితులతో మాట్లాడుతారు. ఇదిలా ఉండగా రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేపై స్పందించిన గవర్నర్ బాధిత ప్రాంతాల్లో పర్యటించటం ముఖ్యమంత్రి బాధ్యత అన్నారు. రాజ్ భవన్ లో ఈ రోజు బూస్టర్ డోసు టీకా వేసుకున్న గవర్నర్ ప్రజలంతా టీకా తీసుకోవాలని పిలుపు ఇచ్చారు.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ తమిలి సై సూచించారు. నా ప్రజలను కలవడానికి వెళ్తున్నాను అన్న గవర్నర్ ఈ రోజు ఢిల్లీ వెళ్లాల్సి ఉంది కానీ ప్రజల దగ్గరకు వెళ్ళడానికి కాన్సల్ చేసుకున్నానని వెల్లడించారు. ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కుంటున్నారో వారిని కలుస్తానని చెప్పారు.
Also Read : భద్రాచలం వద్ద 69 అడుగులు దాటిన నీటిమట్టం