Friday, June 12, 2026
Homeసినిమాచరణ్ తో లోకేష్ కనగరాజ్ సినిమా క‌న్ ఫ‌ర్మ్.

చరణ్ తో లోకేష్ కనగరాజ్ సినిమా క‌న్ ఫ‌ర్మ్.

Lokesh: ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ కు ఎంత‌టి క్రేజ్ వ‌చ్చిందో తెలిసిందే. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ దిల్ రాజు నిర్మాతగా శంకర్ డైరెక్ష‌న్ లో భారీ పాన్ ఇండియా మూవీలో న‌టిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తోంది.  ఈ మూవీని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. దీని  త‌ర్వాత జెర్సీ డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరితో కాంబినేషన్ సెట్ అయ్యింది.

అయితే.. త‌న‌కు వ‌చ్చిన క్రేజ్ కి త‌గ్గ‌ట్టుగా ఇక నుంచి పాన్ ఇండియా డైరెక్ట‌ర్స్ తోనే సినిమాలు చేయాల‌ని చ‌ర‌ణ్ ఫిక్స్ అయ్యార‌ని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ‘విక్ర‌మ్’తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన లోకేష్ క‌న‌క‌రాజ్ తో చ‌ర‌ణ్ నటిస్తాడని కొన్ని రోజులుగా వార్తలు వ‌స్తూనే ఉన్నాయి. అయితే.. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్ వ్యూలో లోకేష్ క‌న‌క‌రాజ్ క్లారిటీ ఇచ్చారు.

‘మా ఇద్దరికున్న కమిట్ మెంట్ ల తరువాతే ఆ మూవీ పట్టాలెక్కుతుందని. అది చాలా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా వుంటుందని’ చెప్పారు. లోకేష్ అలా చెప్ప‌డంతో కోలీవుడ్ లో ఈ ప్రాజెక్ట్ పై మ‌రిన్ని అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంది. అయితే.. గౌత‌మ్ తిన్న‌నూరిసినిమా త‌ర్వాత ఇది ఉంటుంద‌ని సమాచారం.

Also Read : చ‌ర‌ణ్‌, శంక‌ర్ మూవీ అప్ డేట్. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular