Thursday, May 30, 2024
Homeసినిమాచ‌ర‌ణ్‌, శంక‌ర్ మూవీ అప్ డేట్.

చ‌ర‌ణ్‌, శంక‌ర్ మూవీ అప్ డేట్.

Fight Scene: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ భారీ పాన్ ఇండియా మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇది చ‌ర‌ణ్ 15వ చిత్రం, దిల్ రాజు 50వ చిత్రం కావ‌డం విశేషం. దీంతో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చరణ్ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన షూటింగులో ఉన్నాడు. గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

ఇక్కడ వేసిన భారీ సెట్స్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందు కోసం భారీ మొత్తంలోనే ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ 8వ షెడ్యూల్ కి సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్లో పాల్గొనడానికి బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా వచ్చింది. ఇక్కడ భారీ యాక్షన్ సీన్ ఒకటి ప్లాన్ చేశారట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమాలో చాలా ముఖ్యమైన సందర్భంలో ఈ ఫైట్ వస్తుందని స‌మాచారం.

ఇంత వరకూ తన సినిమాలో చూడని ఒక ఫైట్ ను శంకర్ ఈ సినిమాలో చూపించనున్నాడని చెబుతున్నారు. ఈ ఫైట్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందట‌. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక రేంజ్ లో ఉండనున్నట్టు సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయనున్నారు. మ‌రి.. చ‌ర‌ణ్‌, శంక‌ర్ క‌లిసి ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి.

Also Read : చ‌ర‌ణ్‌, శంక‌ర్ మూవీ స‌రికొత్త టైటిల్! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్