రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ తో కలసి ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహణ. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలపై నిర్వహించిన ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సి.ఎస్ మాట్లాడుతూ, రానున్న రెండు రోజుల్లోభారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినందున జిల్లాకలెక్టర్లు అప్రమత్తతతో ఉండాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం ఏర్పడకుండా చర్యలు చేపట్టాలి.
వరుసగా రెండు రోజులు సెలవు రోజులు వస్తున్నందున, సెలవులను ఉపయోగించకుండా పునరావాస కార్యక్రమాలలో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. పొరుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నందున వరదలు అధికంగా వచ్చే అవకాశం ఉందని, ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నిండినందున చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఎక్కడైతే రహదారులు, బ్రిడ్జిలు తెగాయో, ఆమార్గాల్లో ప్రమాదాలు జరగకుండా వాహనాలను, ప్రయాణకులను నిలిపి వేయాలని స్పష్టం చేశారు. పోలీసు, నీటి పారుదల, రోడ్లు భవనాలు, విధ్యుత్, రెవిన్యూ తదితర శాఖలన్నీ మరింత సమన్వయంతో పనిచేయాలని సోమేశ్ కుమార్ పెకొన్నారు.
Also Read : వరద బాధిత ప్రాంతాల్లో ముగిసిన కేంద్ర బృందం పర్యటన