Friday, June 12, 2026
Homeసినిమా 'రామారావు ఆన్ డ్యూటీ' మాస్ నోటీసు విడుదల

 ‘రామారావు ఆన్ డ్యూటీ’ మాస్ నోటీసు విడుదల

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ‘ జూలై 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ అవుతుంది. శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ సినిమా పై క్యురియాసిటీని పెంచింది. సినిమా విడుదలకు రెండు రోజులు వుండగా ‘రామారావు ఆన్ డ్యూటీ మాస్ నోటీస్ ‘గా మరో పవర్ ఫుల్ మాస్ యాక్షన్ మినీ ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

‘రామారావు ఆన్ డ్యూటీ మాస్ నోటీస్’ బ్రిలియంట్ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో అలరించింది. ”నేను లక్కుల మీద లాటరీల మీద డిపెండయ్యేవాడిని కాదు.. నా వర్క్ మీద డిపెండ్ అయ్యేవాడిని” అని రవితేజ చెప్పిన డైలాగ్స్ థియేటర్ లో ఫ్యాన్స్ తో విజల్స్ వేయించే మూమెంట్ లా వుంది. ”మీ ఆయన మెరుపు లాంటి వాడు. శబ్దం లేకుండా వెలుగునిచ్చే రకం”అని తనికెళ్ళ భరణి చెప్పే డైలాగ్ రామారావు పాత్ర ఎంత పవర్ ఫుల్ గా వుంటుందో తెలియజేసింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ పవర్ ఫుల్ గా ఉంటూ అదే సమయంలో చాలా యూనిక్ గా వున్నాయి. సామ్ సిఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవుట్ స్టాండింగా వుంది.

దర్శకుడు శరత్ మాండవ ఫ్యాన్స్, మాస్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే ఎలిమెంట్స్ తో రామారావు అన్ డ్యూటీని సిద్ధం చేశారని ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే అర్ధమౌతుంది. విడుదలకు రెండు రోజులు ముందు చిత్ర యూనిట్ విడుదల చేసిన ‘రామారావు ఆన్ డ్యూటీ మాస్ నోటీస్ ‘ సినిమా పై మరింత క్యూరియాసిటీని పెంచింది. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించగా, వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం జూలై 29న విడుదల కానుంది.

Also Read : ఆకట్టుకున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ థియేట్రికల్ ట్రైలర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular