Saturday, July 27, 2024
Homeసినిమాఆకట్టుకున్న 'రామారావు ఆన్ డ్యూటీ' థియేట్రికల్ ట్రైలర్

ఆకట్టుకున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ థియేట్రికల్ ట్రైలర్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూలై 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమౌతోంది. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. హైదరాబద్ లో ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

”ఇన్నాళ్ళు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా చట్టప్రకారం న్యాయం కోసం డ్యూటీ చేసిన నేను..ఇక పై రామారావు గా ధర్మం కోసం డ్యూటీ చేస్తాను” అని మాస్ మహారాజా రవితేజ చెప్పిన డైలాగ్ తో మొదలై ట్రైలర్.. ఆద్యంతం యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో బ్రిలియంట్ గా సాగింది. ట్రైలర్ బిగినింగ్ లో ఒక ఆపరేషన్ లో వేర్వేరు ప్రాంతాలకు చెందిన కష్టజీవులు మాయమయ్యారని చెప్పడం.. ”మా నాన్నని వెదకడానికి హెల్ప్ చేస్తారా ?” అని ఓ పాప ప్రదేయపడగా… రామారావు గా రవితేజ ఎంట్రీ మెస్మరైజింగా అనిపించింది. ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్ లు, రవితేజ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ లో వున్నాయి.

ముఖ్యంగా ‘రామారావు ఆన్ డ్యూటీ‘ కథ  ట్రైలర్ చాలా క్యూరియాసిటీని పెంచేసింది. ఒక ప్రాంతంలోని వ్యక్తులు ఎందుకు మిస్ అవుతున్నారు? ఆ ఆపరేషన్ వెనుక ఉన్నదెవరు? ఈ మిస్టరీని రామారావు ఎలా చేధిస్తాడనేది ట్రైలర్ లో చాలా గ్రిప్పింగా చూపించారు. ”కనిపించకుండాపోయింది ఒక్కరో ఇద్దరో కాదు” అని రామారావు చెప్పడం మరింత థ్రిల్, సస్పెన్స్ ని యాడ్ చేసింది. ట్రైలర్‌లో సినిమాకు సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ ని చాలా ఇంట్రెస్టింగా ప్రజెంట్ చేశారు.

బలమైన కథ, కథనం, పాత్రలు,ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఆసక్తికరంగా ఉనాయి. రవితేజ నిజాయితీ ధైర్యం గల గవర్నమెంట్ ఆఫీసర్‌గా, ఫ్యామిలీ మ్యాన్‌గా, రొమాంటిక్ గాయ్ గా, గొప్ప వ్యక్తిత్వం వున్న మనిషిగా డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి అన్ని కోణాల్లో ఒదిగిపోయారు. పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన వేణు తొట్టెంపూడి పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.

దర్శకుడు శరత్ మండవ తన తొలిచిత్రంలోనే తనకంటూ ఒక ప్రత్యేక ముద్రవేసుకున్నాడు. నిజానికి ఈ కథ 1995లో నాటిది. ఒక చాలెంజింగ్ సబ్జెక్ట్‌ని చాలా కన్విన్సింగ్‌గా డీల్ చేశాడని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. సత్యన్ సూర్యన్ కెమెరా పనితనం అద్భుతంగా వుంది. సామ్ సిఎస్ అందించిన బీజీఎం సస్పెన్స్ థ్రిల్ ని ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్ డిజైన్ ఉన్నతంగా వుంది. ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్