Tuesday, June 9, 2026
Homeస్పోర్ట్స్CWG-2022: నాలుగో రోజు ఇండియాకు 3పతకాలు

CWG-2022: నాలుగో రోజు ఇండియాకు 3పతకాలు

కామన్ వెల్త్ గేమ్స్ నాలుగోరోజు ఆగస్ట్ 1న ఇండియా మరో మూడు పతకాలు సాధించింది. వీటిలో ఒకటి రజతం కాగా మరో రెండు కాంస్య పతకాలు…జూడో విభాగంలో ఒక రజతం, ఒక కాంస్యం లభించగా, వెయిట్ లిఫ్టింగ్ లో ఒక కాంస్యం దక్కింది.

జూడో లో సుశీలా దేవి రజత పతకం సాధించింది. 48కిలోల కేటగిరీలో ఆమె రెండో స్థానంలో నిలిచింది.

మరోవైపు జూడో 60 కిలోల విభాగంలో విజయ్ కుమార్ కాంస్యం సంపాదించాడు.

మరోవైపు మహిళల వెయిట్ లిఫ్టింగ్ లో హర్జీందర్ కౌర్ 71కిలోల విభాగంలో కాంస్యం దక్కించుకుంది

ఆగస్ట్ 1న లభించిన మూడు పతకాలతో ఇండియా మొత్తం ఇప్పటి వరకూ 9 మెడల్స్ సాధించింది. వీటిలో బంగారు, రజతం, కాంస్యం మూడేసి చొప్పున ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular