ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కామన్ వెల్త్ క్రీడల విజేతలకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. గతవారం ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హామ్ లో ముగిసిన 44వ కామన్ వెల్త్ క్రీడల్లో ఇండియా 22 గోల్డ్, 16 రజత, 23 కాంస్యాలతో మొత్తం 61 పతకాలు గెల్చుకున్నారు. పతకాల పట్టికలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా తరువాత నాలుగో స్థానంలో ఇండియా నిలిచింది.
భారత దేశం తరఫున వివిధ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించి పతకాలు గెల్చుకున్న క్రీడాకారులందరినీ ప్రధాని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
బాక్సింగ్ లైట్ వెయిట్ 50 కిలోల విభాగంలో స్వర్ణం సాధించిన తెలంగాణా బిడ్డ నిఖత్ జరీన్ రేపటి సమావేశంపై ఎంతో ఉత్సుకతతో ఉంది. తాను విజయం సాధించిన బాక్సింగ్ గ్లోవ్స్ పై ప్రధాని మోడీ సంతకం తీసుకోవాలని ఆశిస్తున్నట్లు పతకం గెలిచిన వెంటనే జరీన్ తన కోరిక వెల్లడించింది. రేపు ప్రధానితో భేటీ సమయంలో సంతకం తీసుకోనుంది.
గతంలో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ గెల్చుకున్నప్పుడు ఆయనతో సేల్ఫీ దిగానని, ఇప్పుడు ఆటోగ్రాఫ్ తీసుకుంటానని వెల్లడించింది.
Also Read : CWG-2022: నిఖత్ జరీన్ కు స్వర్ణం