చార్ ధాం యాత్ర ను రద్దు చేస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై ఒకటో తేది నుంచి ప్రారంభం కావల్సిన యాత్ర ను రద్దు చేస్తున్నామని, మళ్ళీ కొత్త తేదీలు ప్రకటిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. కరోనా నేపథ్యంలో చార్ ధాం యాత్ర పై రాష్ట్ర హైకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఉత్తరాఖండ్ లోని చమోలి, ఉత్తరకాశి, రుద్ర ప్రయాగ్ మూడు జిల్లాల ప్రజలకు జూన్ 25 వ తేదీ నుంచి ప్రభుత్వం యాత్రకు అనుమతించింది. జూలై ఒకటి నుంచి మొదటి దశ, జూలై 11 వ తేది నుంచి రెండో దశల చార్ ధాం యాత్రకు దేశంలోని ఇతర ప్రాంతాల భక్తులు రావచ్చని ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తాజా పరిస్థితులతో యాత్ర రద్దు కావటంతో భక్తులు నిరాశకు గురయ్యారు. బద్రినాథ్, కేదరనాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాల్లో జరిగే పూజ కార్యక్రమాలను భక్తుల కోసం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూపించాలని హైకోర్ట్ ఆదేశాలు చేసింది.